కృష్ణ, గోదావరి నదులు ఇప్పుడిప్పుడే శాంతిస్తున్నాయి. కొన్ని చోట్లకు స్వల్పంగా వరద నీరు చేరుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం మధ్యాహ్నం 3గంటలకు తగ్గి 41.9అడుగులకు చేరింది. అయితే కల్యాణ కట్ట వరకూ వరద నీరు అలాగే ఉంది. పట్టణంలోని డ్రైనేజీ, బ్యాక్‌ వాటర్‌ను మోటర్లతో గోదావరిలోకి ఎత్తిపోస్తున్నారు. అటు ప్రాణహిత నది కూడా గురువారం కాస్త శాంతించింది. ప్రాణహిత, గోదావరి నదుల సంగమం కాళేశ్వరం వద్ద నది […]

Continue Reading

దేశంలో కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గురు వారం తాజాగా రికార్డు స్థాయిలో 83,883 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,406కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,043 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 67,376కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 6 రోజుల నుంచి దేశంలో వరుసగా రోజుకు 60 వేలకు పైగా కోలుకుంటున్నారని తెలిపింది.

Continue Reading

తమ్ముడితో గొడవపడి బాలిక ఆత్మహత్య

టీవీ రిమోట్‌ కోసం తమ్ముడితో గొడవపడి బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం చాందూరికి చెందిన తులిదాస్‌, అంతకళలకు కూతురు రేఖ (13), కుమారుడు గణేశ్‌ ఉన్నారు. గురువారం దంపతులు పొలానికి వెళ్లగా.. అక్క, తమ్ముడు ఇంట్లో టీవీ చూడసాగారు. నచ్చిన ఛానల్‌ చూసేందుకు టీవీ రిమోట్‌ కోసం ఇద్దరూ గొడవ పడ్డారు. గణేశ్‌ రిమోట్‌ ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన రేఖ క్ష ణికావేశంలో ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుంది. గమనించిన గణేష్‌ సమీపంలో […]

Continue Reading

హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఏమీ లేకుండానే పోలీసులపై ఆరోపణలు చేసే ధైర్యం సామాన్యులకు ఉంటుందా? పోలీసులు కాగితాల్లో చెప్పేదానికి, క్షేత్రస్థాయిలో జరిగేదానికి చాలా వ్యత్యాసం ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేగాక కిందిస్థాయి ఉద్యోగుల తీరు వల్ల ఉన్నతాధికారులకు తలనొప్పులు వస్తుంటాయని పేర్కొంది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారని, ఆమె తన వద్దకు రాకుండా తాడిపత్రి పోలీసు స్టేషన్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) నియంత్రిస్తున్నారని, ఆమెను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ అనంతపురం […]

Continue Reading

తాళ్లరేవు, సెప్టెంబరు 3: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు పరిధిలోని కోరింగ మడ అడవుల్లో నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై స్థానిక పోలీస్‌, ఎక్సైజ్‌, స్పెషల్‌ బృందాలు గురువారం సాయంత్రం దాడులు చేశాయి. 22 సారా బట్టీలపై దాడులు చేసి 46 వేల లీటర్ల బెల్లపుఊట, 1400 లీటర్ల సారాను ధ్వంసం చేశామని, నిర్వాహకులు పారిపోయారని శాండ్‌ అదనపు ఎస్పీ సుమిత్‌ గరుడా తెలిపారు.

Continue Reading

– రాష్ట్రాలకు నష్టపరిహారం ఎందుకు?..కేంద్రం బాధ్యత ఏమిటీ..

న్యూఢిల్లీ : జీఎస్టీకి పూర్వం(2017 జులైలో జీఎస్టీ వచ్చింది) కేంద్రం ఎక్సైజ్‌ సుంకాలు విధించేది. రాష్ట్రం ముందు అమ్మకం పన్ను, తర్వాత వాల్యూ యాడెడ్‌ టాక్స్‌(వ్యాట్‌- విలువ ఆధారిత పన్ను) అనేది వేసేది. అలాగే కేంద్రం సర్వీసెస్‌ పైన సర్వీస్‌ ట్యాక్స్‌ వేసేది. ఇవన్నీ కలిపి జీఎస్టీ రూపంలో ఒక యునిఫైడ్‌ ఆలిండియా ట్యాక్స్‌ రెజిమ్‌.. దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీకి కేంద్రం తమకు రాజ్యాంగం ఇచ్చిన పన్నుల అధికారాలు కొన్నింటిని, రాష్ట్రము తమకు రాజ్యాంగం ఇచ్చినటువంటి […]

Continue Reading