నేడు ఏపీ క్యాబినెట్.. ఆ విషయం మీదే ఉత్కంట !

ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్ప్తోంది. ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించడం సాధ్యాసాద్యల మీద క్యాబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలానే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు […]

Continue Reading

ప్లాస్మా దానం చేయాలని కోరిన అనసూయ…

బుల్లితెరపై యాంకర్ గా ఆదరగోడుతుంది అనసూయ. జబర్దస్త్ షోలు చేసుకుంటూనే మరికొన్ని ప్రోగ్రాంలకి యాంకర్ గా చేస్తుంది. మంచి అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ స్టార్ యాంకర్ ప్లాస్మా దానం చేయాలని అభిమానులకు, ప్రజలకు పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ పోలీసులు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ… ప్రస్తుతం మనం అందరం కోవిడ్ కష్ట కాలంలో ఉన్నాము. ఎంతో […]

Continue Reading

అమిత్ షాకు చంద్రబాబు ఫోన్​…

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అమిత్ షా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్యం మెరుగుపడుతోందని త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుంటానని అమిత్ షా చంద్రబాబుతో చెప్పినట్లు తెలిసింది. అయితే ఆగస్టు 2న కరోనా బారిన పడిన అమిత్‌ షా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ కరోనా నుంచి కోలుకుని ఆగస్ట్‌ 14న ఇంటికి వచ్చిన […]

Continue Reading

ప్రధాని మోడీ ట్విట్టర్‌ హ్యాక్..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది… ప్రధాని మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్ హ్యాక్ చేయబడిందని ట్విట్టర్ ధృవీకరించింది.. హ్యాకింగ్‌పై విచారణ చేపట్టామని.. దీని రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. మేం పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఈ సమయంలో, అదనపు ఖాతాలు ప్రభావితమవుతాయని భావించడంలేదు అని ట్విట్టర్ ప్రతినిధి పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు.. పీఎం నరేంద్ర మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్‌తో ధృవీకరించబడిన […]

Continue Reading

హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్సన్‌కు కరోనా

హైదరాబాద్‌: హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్సన్‌కు కరోనా సోకింది. ఇంట్లో అందరికీ కోవిడ్‌19 సంక్రమించినట్లు అతను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. మాజీ రెజ్లర్ అయిన జాన్సన్ ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషం అందుకుంటున్న హీరోగా మారాడు. భార్య, ఇద్దరు కూతుళ్లకు కూడా వైరస్ సోకినట్లు రాక్‌స్టార్ తన పోస్టులో తెలిపాడు. చాలా క్రమశిక్షణతో ఉన్నా తమకు వైరస్ సంక్రమించిందని డ్వెయిన్ తెలిపాడు. రెండున్న వారాల క్రితం తమకు వైరస్ సంక్రమించినట్లు 48 ఏళ్ల జాన్సన్ చెప్పాడు. […]

Continue Reading

మంత్రి బాలినేని రాజీనామా ఎవరు కోరారు?: రామకృష్ణ

అమరావతి: రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ స్మార్ట్ మీటర్ల కోసం రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా ఎవరు కోరారని నిలదీసిన ఆయన గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకోవడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల కోసం కేంద్రం అనుమతికై ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు సై అన్నదని వ్యాఖ్యానించారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మరో రూ.వెయ్యి కోట్ల వృథా ఖర్చు అవసరమా? అని ప్రశ్నించారు. […]

Continue Reading

ఏపీ రేషల్ డీలర్స్ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కరోనాతో మృతి

అమరావతి: ఏపీ రేషల్ డీలర్స్ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కృష్ణదాస్ కరోనాతో మృతి చెందారు. అతని భార్యకు కూడా కరోనా సోకడంతో ప్రస్తుతం వెంటీలేటర్ మీద చికిత్స పొందుతుండగా…. అదే ఆసుపత్రిలో కుమారుడు కూడా ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో డోర్ డెలివరీకి పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పంపిణీ కారణంగా కృష్ణదాస్‌కు కరోనా సోకిందని డీలర్లు ఆరోపించారు. యేడాదిగా గన్నిల డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం […]

Continue Reading

బాబుపై సీరియస్ గా జేసి బ్రదర్స్

టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చం నాయుడు ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఇంటికి వెళ్లి కలిశారు. అదే విధంగా మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరుపై చాలా మంది […]

Continue Reading

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు జరిమానా

హైదరాబాద్‌ : జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తికి జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. వీఎస్‌టీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటోను ఓ నెటిజన్‌ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో నరేందర్‌కుమార్‌ అనే వ్యక్తికి రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు పంపారు. హైదరాబాద్‌ : జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా […]

Continue Reading

ఐపీఎల్ 2020లో మరో షాక్.. ముంబై ఇండియన్స్‌కు మలింగ దూరం

ఐపీఎల్ 2020 సీజన్‌ ప్రారంబానికి కొన్ని రోజుల ముందే ఊహించని పరిణామాలు ఏర్పడుతున్నాయి. అసలే కరోనా కాలంలో ఎంతో కట్టుదిట్ట చర్యలతో సిరీస్ నిర్వహించడానికి ముందుకు రాగా.. ఆటగాళ్ల నుంచి ఆయా ఫ్రాంచైజీలకు షాక్ తగులుతోంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ దూరం అయ్యారు. తాజాగా ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా ఇలాంటి కష్టాలే ప్రారంభం అయ్యాయి. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు శ్రీలంక ఫేమస్ బౌలర్ మలింగ్ […]

Continue Reading