అమెజాన్ ప్రైమ్‌లో అనుష్క నిశ్శబ్దం.. తప్పని పరిస్థితి..

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్‌తో పాటు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే […]

Continue Reading

పనికి పంపితే గర్భిణిని చేశాడు..

సింగరాయకొండ: కుటుంబ పోషణ నిమిత్తం తమ కుమార్తెకు ఉపాధి చూపమంటూ తల్లిదండ్రులు అతన్ని నమ్మి పనికి పంపారు. వెంట వచ్చిన అభంశుభం ఎరుగని బాలికపై కన్నేసిన అతను బెదిరింపులకు గురిచేసి.. మత్తు కలిపి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు అతని భార్యే సహకారం అందించడం గమనార్హం. ఎస్సై మేడా శ్రీనివాసరావు మంగళవారం తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. వలేటివారిపాలెం మండలం వలేటివారిపాలేనికి చెందిన ఓ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో […]

Continue Reading

తిరుమలేశుణ్ణి దర్శించుకున్న అచ్చెన్నాయుడు

తిరుమల: టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టైన అచ్చెన్నాయడుకి ఇటీవలె బెయిల్‌ లభించింది. అయితే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇటీవలె ఆయన కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇలా చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన అచ్చెన్న.. నేడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

Continue Reading

పూర్తి స్థాయి బస్సు సర్వీసులు నడుపుతాం

అమరావతి: గతంలో ఏపీ నుంచి తెలంగాణకు ఉన్న బస్సు సర్వీసులన్నీ మళ్లీ నడపాలనుకుంటున్నామని, తెలంగాణ నుంచి ఏపీకి మరిన్ని సర్వీసులు పెంచుకోవాలని రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు.. తెలంగాణ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు. బస్సు సర్వీసుల పునరుద్ధరణ, అంతర్‌రాష్ట్ర ఒప్పందంపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాసి తమ ఉద్దేశాన్ని తెలిపారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల కంటే […]

Continue Reading

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

వరంగల్‌ : వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. దామెర మండలం పసరగొండ వద్ద లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. బుధవారం తెల్లవారు జామున ఘటన చోటు చేసుకున్నది. ప్రాథమికంగా లభించిన వివరాల మేరకు మృతులు వరంగల్‌ జిల్లాలోని పోచమ్మ మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులను మేకల రాకేశ్‌, మేడి చందు, సాబీర్‌, పవన్‌గా తేల్చారు. కాళేశ్వరం నుంచి వరంగల్‌ వైపుగా వస్తున్న ఇసుక లారీ, […]

Continue Reading

చంద్రబాబుకి నోటీసులు.. లోకేష్ కి కూడా..!

వైఎస్సార్సీపీ నేతల వేధింపులు తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు డీజీపీకి లేఖ రాయడం తెలిసిందే. దళిత వర్గానికి చెందిన ఎం నారాయణ, ఓం ప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని ఆయన ఆ లేఖలో గుర్తుచేశారు. మంత్రి నియోజకవర్గం పుంగనూరులో క్షీణించిన శాంతి భద్రతలకు ఇదే నిదర్శనమన్నారు. ఒక్క పుంగనూరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర […]

Continue Reading

కొవిడ్‌ వ్యాప్తి తగ్గినట్టేనా?

జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ వ్యాప్తి తగ్గినట్టేనా? అని అధికారులు మేధోమథనం చేస్తున్నారు. గత 18 రోజులుగా నమోదవుతున్న కేసుల్లో లక్షణాలు కనిపించకపోవడమే దీనికి కారణమంటూ పలువురు వైద్యాధికారులు అంటున్నారు. అధికశాతం కేసులు గ్రామాల పరిధిలోనే బయటపడుతున్నాయి. కొవిడ్‌ సోకిన రోగులంతా విజయవాడకు వచ్చి వెళ్లిన వారే. కానీ వారిలో లక్షణాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. దీంతో కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల విషయంలో అధికారుల పని తీరును […]

Continue Reading

దూరదర్శన్‌ ప్రాంతీయ వార్తా విభాగాధిపతిగా రత్నాకర్‌

విజయవాడ దూరదర్శన్‌ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతిగా పాముల రత్నాకర్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2002లో కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖలో చేరిన ఆయన కడప జిల్లా క్షేత్ర ప్రచార విభాగ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌లోని భారత పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) సహాయ, డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. విశ్వసనీయమైన, కచ్చితమైన సమాచారాన్ని సకాలంలో ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని రత్నాకర్‌ తెలిపారు.

Continue Reading

ఆధార్‌ అనుసంధానం… తప్పని నిరీక్షణం

సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. కొవిడ్‌ నేపథ్యంలో నగరంలో ఎక్కడా కేంద్రాలు పని చేయడం లేదు.. గుంటూరు నగరం కొరిటెపాడు ఎస్బీఐ శాఖలోనే సేవలు అందిస్తున్నారు. అదీ ముందు వచ్చిన 70 మందికి మాత్రమే. దీంతో తెల్లవారుజామున 4గంటల నుంచే టోకెన్ల కోసం జనం బారులు తీరుతున్నారు. ఆ తర్వాత వచ్చిన వారు బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. కేంద్రాలను పెంచి సేవలను మెరుగుపర్చాలని జనం కోరుతున్నారు.

Continue Reading

పులి లాంటి కుక్క.. అలా మార్చిన వ్యక్తిని పట్టిస్తే అద్భుతమైన గిఫ్ట్

వీధుల్లో ఓ పులి తిరుగుతోంది. దాని చూసి జనాలంతా పరుగులు పెడుతున్నారు. కాస్త తీక్షణంగా చూస్తే అది పులికాదు. వీధి కుక్కే. అలాగని పుట్టుకతోనే దానికి ఆ రంగు రాలేదు. ఎవరో కావాలనే రంగులు వేసి అలా మార్చారు. నారింజ, నలుపు చారలు వేసి అచ్చం పులిలా మార్చేశారు. ఎవరో సరదా కోసం ఈ పనిచేశారు. అతడు సరదా కోసమే చేసి ఉండొచ్చు.. కానీ ఇప్పుడీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మలేషియాలో జరిగిన ఈ ఘటనపై […]

Continue Reading