ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల వరకు 16.01 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. మొత్తం 25.97 శాతం మందికి పెన్షన్ల పంపిణీ జరింది. రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. పెన్షన్ కానుక కోసం ప్రభుత్వం రూ.1496.07 కోట్లు విడుదల చేసింది. ఈనెలలో కొత్తగా 90,167 మందికి పెన్షన్‌ను అందించనుంది. కొత్త పెన్షన్‌దారుల కోసం రూ.21.36 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2.68 […]

Continue Reading

వీడియో కాల్‌ మాట్లాడుతూ శస్త్రచికిత్స!

హైదరాబాద్‌: వైద్యుల నిర్లక్ష్యంతో సిజేరియన్‌ శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సార్‌నగర్‌ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారెడ్డి వివరాల ప్రకారం.. గాయత్రిహిల్స్‌లోని నవభారత్‌నగర్‌కు చెందిన ఎం.జానకి(23)కి పురిటినొప్పులు ఎక్కువవడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 28న ఉదయం శ్రీరామ్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. 29న అర్ధరాత్రి 2.30 గంటలకు ఆసుపత్రిలోని వైద్యురాలు, మరో నర్సు, ఇతర సిబ్బంది సిజేరియన్‌ చేయగా మగబిడ్డ పుట్టాడు. ఆ తరువాత జానకి ఆరోగ్యం […]

Continue Reading

కోవిడ్ నిబంధనలతో మాజీ రాష్ట్రపతి అంత్యక్రియలు

Last rites of former President Pranab Mukherjee: న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్‌ ముఖర్జీ (84) సోమవారం ఢిల్లీలోని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే.. మంగళవారం ఉదయం 8గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి పార్థీవ దేహాన్ని రాజాజీమార్గ్‌లోని ప్రణబ్ అధికారిక నివాసానికి తరలించనున్నారు. ముందుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు […]

Continue Reading

తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు..!

తెలంగాణలో నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనుంది. దీనికి సంబందించిన టైమ్ టేబుల్ ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. దూరదర్శన్, టీ-శాట్ ద్వారా మూడవ నుంచి పదవ తరగతి వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయి. మూడవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు నిర్వహించనున్నారు. […]

Continue Reading

ఏపీలో 120 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే.. జనవరి 1న శ్రీకారం..

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం ఏపీనే 1930 తర్వాత చేపడుతున్న తొలి భూముల రీసర్వే భూ యజమానులు రైతులకు ఇకపై శాశ్వత హక్కులు ఏ వ్యక్తీ భూముల వివరాల్లో మార్పులు చేర్పులు చేయలేరు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన అధ్యక్షతన క్యాంపు […]

Continue Reading

యూపీలో దారుణం..తల్లి,సోదరుడిని కాల్చి చంపిన మైనర్.!

యూపీలో దారుణం చోటు చేసుకుంది. 16ఏళ్ల మైనర్ బాలిక తన తల్లి,సోదరుడిని పిస్టల్ తో కాల్చి హత్యచేసింది. అనంతరం తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ రాజధానిలోని గౌతంపల్లిలోని వివేకానంద మార్గ్‌లో రాజేష్ దత్ బాజ్‌పాయ్, భార్య మాలిని, కుమారుడుతో పాటు 16 ఏళ్ల కుమార్తె నివాసముంటున్నారు. కాగా తండ్రి రాజేష్ దత్ బాజ్‌పాయ్ రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఢిల్లీలో నివసిస్తుండగా….తల్లి కుమారుడు,కుమార్తె తో కలిసి లక్నో లో నివసిస్తుంది. అయితే […]

Continue Reading

జంగారెడ్డిగూడెంలో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని 42వ రేషన్ దుకాణంలో రేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తుండగా స్థానికులు వ్యాన్‌ను అడ్డుకున్నారు. విషయాన్ని అధికారులు రెవెన్యూ అధికారులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు.. అక్రమంగా నిల్వ చేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రేషన్ బియ్యాన్ని అక్రమ నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేశారు.

Continue Reading

ట్యాంక్‌బండ్‌పై గ్యాంగ్‌వార్‌..!

ట్యాంక్‌బండ్‌పై గణేష్‌ నిమజ్జనం సందర్భంగా సోమవారం వేకువజామున చిన్నపాటి గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న వారిని నెమ్మదిగా వెళ్లమని మందలించినందుకు ప్రారంభమైన గొడవ పెద్దదిగా మారి దాడి చేసేం త వరకు వెళ్లింది. ఇదే సందర్భంలో టాటా సఫారీ కారుతో పాటు పక్కనే ఉన్న బస్టాప్‌ అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు

Continue Reading

నేడు ఇడుపులపాయ వెళ్లనున్న సీఎం జగన్..

YS Jagan | దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలో నివాళులు అర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు కడపకు వెళ్లనున్నారు. అదేవిధంగా గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నివారించే లక్ష్యంతో రూ. 1,863.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా […]

Continue Reading

పేదల ఆరోగ్యంపై ప్రణాళిక రూపొందించండి

దిల్లీ: పేదల ఆరోగ్యం విషయమై బృహత్తర ప్రణాళిక రూపొందించాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైద్యానికి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులను నియంత్రించాలని, చిన్నపట్టణాల్లో కూడా తక్కువ ఖర్చుకే వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సచిన్‌ జైన్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ […]

Continue Reading