రూ.166 కోట్ల దారి మళ్లింపు

హైదరాబాద్‌: బ్యాంకు కల్పించిన క్రెడిట్‌ లిమిట్‌ను దుర్వినియోగం చేసి రూ.166.93 కోట్లు దారి మళ్లించిన ఉదంతంలో హైదరాబాద్‌కు చెందిన చదలవాడ ఇన్ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ (సి.ఐ.టి.ఎల్‌.) సంస్థతో పాటు దాని సంచాలకులపైనా హైదరాబాద్‌ సీబీఐ విభాగం సోమవారం కేసు నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి 13న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దేబాశిష్‌ భట్టాఛార్జి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు నిర్వహించిన సీబీఐ అధికారులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. సి.ఐ.టి.ఎల్‌. […]

Continue Reading

ప్రకాశం జిల్లాలో 291 కరోనా కేసులు

ప్రకాశం : జిల్లాలో తాజాగా 291 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా ఇప్పడి వరకు 48,242 మంది కరోనా బారిన పడ్డారు. కాగా, ఒంగోలులో అత్యధికంగా 62 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 482 మంది చనిపోయారు. మంగళవారం నాడు 51 మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల […]

Continue Reading

సైబర్​ నేరగాళ్లుగా మారిన కూళీలు

ఒకప్పుడు ఫ్యాక్టరీ కూలీలు.. ఇప్పుడు సైబర్‌చీటర్లకు ఏజెంట్లు.. భారీగా సంపాదన. వీరి విద్యార్హత అంతంత మాత్రమే. పేటీఎం తదితర వేదికల నుంచి పలువురి ఫోన్‌ నంబర్లు సేకరించడం, బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆ పత్రాలను సైబర్‌చీటర్లకు అందిస్తూ అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలాగే నకిలీ ఆర్మీ ఉద్యోగుల ఐడీతో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేస్తూ మోసాలకు పాల్పడుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ […]

Continue Reading

సచివాలయం నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నలుగురి అరెస్ట్‌

తాడికొండ: ఏపీ సచివాలయంలో నకిలీ పత్రాలను ఫోర్జరీ చేసి మోసం చేసిన నలుగురు వ్యక్తులను గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంత్రి కొడాలి నాని పేషీలో ఔట్‌ సోర్సింగ్‌ అటెండర్‌గా పనిచేస్తున్న సతీష్‌ వర్మ అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానంటూ యాగయ్య అనే వ్యక్తి వద్ద రూ. 3.30 లక్షలు తీసుకున్నాడు

Continue Reading

మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా పని చేయండి

ఏపీకి చెందిన సివిల్స్‌ విజేతలకు ముఖ్యమంత్రి జగన్‌ సూచన  అమరావతి: ఏ రాష్ట్ర కేడర్‌లో పనిచేసినా ఏపీకి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సివిల్స్‌ విజేతలకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. రాష్ట్రం నుంచి ఇటీవల సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన 10 మంది మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారు.

Continue Reading

అదిగో వ్యర్థం… ఇదిగో ఇంధనం…

షెడ్‌లో ఏర్పాటు చేసిన ఇంధన తయారీ యనిట్‌ ఇంధన వ్యయాలను ఆదా చేసుకోవడానికి సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని గుంటూరు నగరపాలిక నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలో నిత్యం వెలువడే ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి డీజిల్‌, పెట్రోలు ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక పరిశీలన విజయవంతం కావడంతో ఇక రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టును ప్రారంభించడానికి నగరపాలిక సన్నద్ధమవుతోంది. మొత్తం వ్యయంలో 25 శాతం వాటాను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ భరించనుంది. నగరపాలిక వాహనాలకు డీజిల్‌, పెట్రోలును బంకుల్లో కొనుగోలు చేయకుండా సొంతంగానే […]

Continue Reading

పుష్కలం.. భూజలం.. జిల్లాలో 70 శాతం అధిక వర్షపాతం

మరో ఐదారు నెలల వరకు భూగర్భ జలాలకు ఢోకా ఉండదా? అంటే అవుననే చెబుతున్నారు భూగర్భ జల నిపుణులు. తాజాగా కురుస్తున్న వర్షాలు నగరవాసులకు నీటి కష్టాలను తీర్చాయి. పుష్కలంగా భూగర్భ జలవనరులను సమకూర్చాయి. గత ఏడాది ఫిబ్రవరిలో మారేడ్‌పల్లి, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ మండలాల్లో భూగర్బజలాలు 20 మీటర్లలోతుకు వెళ్లాయి. మొదట్లో 7.45 మీటర్లలోతులో ఉండగా, 12.25 మీటర్లలోతుకు తగ్గడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో చూస్తే పరిస్థితి మొత్తంగా మారిపోయింది. ఇప్పుడు 4.84 మీటర్లలోతులోనే భూగర్భ […]

Continue Reading

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తాం.. ప్రేమ్‌గౌడ్

బండ్లగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించుకుంటామని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం డివిజన్‌ పరిధిలో డిగ్రీ చదివిన విద్యార్థులతో చర్చించి వారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని బస్తీల్లో అవగాహన కల్పించారు. పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులున్నా తాము పరిష్కరిస్తామన్నారు.

Continue Reading

ప్రయివేటు టీచర్లకు సరుకుల పంపిణీ

కరోనా నేపథ్యంలో ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయుల పరిస్థితి ధీనంగా ఉండటంతో నాగారం మున్సిపాలిటి 4వ వార్డు కౌన్సిలర్‌ బుద్దవరం లక్ష్మీ వేణుగోపాల్‌ సుమారు 25 మంది ఉపాధ్యాయులకు బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మునుగుంటి సురేష్‌, సీనియర్‌ నాయకులు కందాడి సత్తిరెడ్డి, బుద్దవరం వేణుగోపాల్‌, కొండబోయిన నాగరాజు, స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శివప్రసాద్‌, ఎలసాని నాగారాజు పాల్గొన్నారు.

Continue Reading

చిన్న గొడవలో యువకుడి హత్య

చిన్న గొడవ విషయంలో సర్దిచెప్పడానికి వెళ్లిన సమయంలో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూన్‌ పేట పోలీసుల వివరాల ప్రకారం విమానపురి కాలనీకి చెందిన పవన్‌, పావని దగ్గరి అన్నా చెల్లెలు. వారు బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా సందీప్‌ అనే యువకుడు వారి పక్క నుండి వచ్చి బైక్‌ పై నుండి కింద పడ్డాడు. దాంతో ఆవేశానికిలోనై సందీప్‌ పవన్‌ వెళ్తున్న బైక్‌ వల్లే తాను […]

Continue Reading