హరీశ్ రావును నిలదీస్తా: జగ్గారెడ్డి

హైదరాబాద్ : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మంత్రి హరీశ్ రావుపై విమర్శలు గుప్పించారు. సింగూరు, మంజీరా డ్యామ్‌లు నింపే వరకు నీళ్ల కోసం నా పోరాటం ఆగదని ఆయన ప్రకటించారు. తమ ఎంపీ ఒక్కసారి కూడా నీళ్ల కోసం నోరు తెరవలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా డమ్మీనే అని జగ్గారెడ్డి విమర్శించారు. త్వరలోనే మంత్రి సమావేశంలో పాల్గొని నీళ్ల విషయంలో నిలదీస్తానని ఆయన ప్రకటించారు. తన మీద టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి […]

Continue Reading

3వేల 795 వీఆర్వో పోస్టుల భర్తీకి ఏపీ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3వేల 795 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO)గ్రేడ్‌ -2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వీఆర్‌వో (గ్రేడ్‌-2) పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) లుగా పనిచేస్తున్న అర్హులకు వన్‌టైమ్‌ ప్రాతిపదికన […]

Continue Reading

కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా.. టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించారని ఆరోపించారు. వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చారని, తన భవనానికి విశాలమైన రోడ్డు వేసుకున్నారని తెలిపారు. కేటీఆర్‌ 111 జీవోను ఉల్లంఘించడంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్లామని చెప్పారు. 8 […]

Continue Reading

షేక్‌పేట తహసీల్దార్‌ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

హైదరాబాద్: షేక్‌పేట తహసీల్దార్‌ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. లంచం తీసుకున్నట్టు షేక్‌పేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై ఆరోపణలు వచ్చాయి. స్థల యజమాని నుంచి రూ. 50 లక్షలు ఆర్‌ఐ నాగార్జున డిమాండ్‌ చేశారు. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఆర్‌ఐ చిక్కాడు. షేక్‌పేట ఆర్‌ఐతో పాటు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బంజారాహిల్స్‌లో ఒకటిన్నర ఎకరం స్థలంపై వివాదం నడుస్తోంది. సయ్యద్‌ అబ్దుల్‌కు చెందిన భూమిని రెవెన్యూ స్థలంగా ప్రభుత్వం పేర్కొంది. […]

Continue Reading

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు

అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ మేనేజర్‌ నాగేశ్వరరెడ్డి ఫిర్యాదుతో జేసీతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. అంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ ఓనర్లు ధర్నాకు దిగారు. లారీ ఇంజిన్ నెంబర్లను అక్రమంగా వాడుకొని తమ లారీలు సీజ్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్నాకు దిగిన లారీ ఓనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన […]

Continue Reading

టీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ అదే.. కేటీఆర్ మళ్లీ మ్యాజిక్ చేస్తారా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అదే 2021 జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు, కసరత్తు చేస్తోంది. ఓ రోడ్ మ్యాప్‌ను టీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అన్నింటినీ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు వరుసగా ప్రారంభోత్సవాలతో టీఆర్ఎస్ పెద్దలు […]

Continue Reading

భార్యలు అలిగి పుట్టింటికి.. భర్తల ఆత్మహత్య !

గుంటూరు జిల్లాలో వరుసగా ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని ఐదుగురు మృతి చెందారు. బాపట్లలో భార్యలు కాపురానికి రావటం లేదని ఇద్దరు భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. పొన్నూరు మండలం నండూరు గ్రామంలో పురుగులు మందు తాగి వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వయసు మీద పడ్డాక పిల్లలలు పట్టించుకొకపోవటంతో బలవన్మరణానికి పాల్పడ్డారు దంపతులు. దీంతో భర్త అంకమరావు, భార్య వెంకాయమ్మ మృతి చెందారు. ఇక మంగళగిరిలో భార్య, భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు, […]

Continue Reading

అధికారులపై స్పీకర్ ఆగ్రహం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎవరికి వారే బాస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ అధికారులపై అగరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా..స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. పొందూరులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన అంశాన్ని అధికారులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పడానికా మీరున్నది అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతుంటే అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటివరకు చర్యలు […]

Continue Reading

కరెంటు బిల్లులు ఒక్క రూపాయి కూడా పెంచలేదు: రఘుమారెడ్డి

హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లులు ఒక్క రూపాయి కూడా పెంచలేదని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. గత మూడు నెలల బిల్లు ఒక్కసారిగా వచ్చేసరికి పెద్ద మొత్తంగా కనిపిస్తుంది చెప్పారు. లాక్‌డౌన్‌తో గత మూడు నెలలుగా మీటర్‌ రీడింగ్‌ తీయలేదని, లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఇప్పుడు తీసుకుంటున్నామని చెప్పారు. గృహ వినియోగంలో తొమ్మిది స్లాబ్‌లు, మూడు కేటగిరీలు ఉన్నాయని, స్లాబులు మారడం వల్ల కేటగిరీలు కూడా మారుతాయని వెల్లడించారు. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 95.13 లక్షల మందికి పైగా వినియోగదారులు […]

Continue Reading

జీహెచ్‌ఎంసీ పరిధిలో టెన్త్‌ పరీక్షలు వాయిదా వేయాలి: హైకోర్టు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో టెన్త్‌ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా చోట్ల పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలని న్యాయస్ధానం ఆదేశించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారిని రెగ్యులర్‌గా గుర్తించాలని చెప్పింది. హైదరాబాద్‌, రంగారెడ్డిలో టెన్త్‌ పరీక్షలకు అనుమతించాలని కోర్టును ప్రభుత్వం కోరింది. విద్యార్థులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించారు.

Continue Reading