అదృష్టం కోసమని కన్న కూతురని కూడా చూడకుండా దారుణంగా..

పుదుకొట్టాయ్: మాత్రింకురాలి మాటలు నమ్మి కన్న కూతురిని పొట్టను పెట్టుకున్నాడో తండ్రి. అదృష్టం కలిసొస్తుందని భావించి మైనర్ బాలికను ఆ దుర్మాగుడు కడతేర్చాడు. మే 19న తమినాడు పుదుకొట్టాయ్ జిల్లాలో జరిగిన ఓ దారుణ హత్య వెనుక మిస్టరీని పోలీసులు ఇటీవల ఛేదించడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. పన్నీర్ సెల్వం అనే నిందితుడు తన రెండో బార్యతో కలసి మొదటి భార్య కుమార్తెను గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కూతురిని పైలోకాలికి పంపిస్తే […]

Continue Reading

స్కూల్ సెక్యూరిటీ గార్డ్ 37 మంది పిల్లలపై దాడి ..

చైనాలోని గ్వాంగ్జీ రీజియన్‌లో ఓ విషాదం చోటు చేసుకుంది. స్కూల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి 37 మంది పిల్లలపై కత్తితో దాడి చేసాడు. దాడిని అడ్డుకున్న ఇద్దరు టీచర్లపై కూడా దాడి చేశాడు. అతడు ఎందుకు ఇంత ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాని టీచర్లు జరుగుతున్న సంఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు. మిన్నంటేలా ఆర్తనాదాలు చేశారు. వాంగ్‌ఫూ సెంట్రల్ ప్రైమరీ స్కూలు విద్యార్థులు గురువారం ఉదయం 8.30కు స్కూలుకు వచ్చారు. విద్యార్థులు వచ్చిన […]

Continue Reading

దెయ్యం పోగొడతానని… యువతిపై స్వామి అత్యాచారం

చిల్కుంద : ‘నీకు దెయ్యం పట్టింది. నేను పోగొడతా’నంటూ మాయమాటలు చెప్పి ఓ యువతిపై స్వామీజీ ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మైసూరు జిల్లా చిల్కుంద గ్రామలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిల్కుంద గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆ యువతికి దెయ్యం పట్టిందని భావించిన బంధువు… సమీపంలోని హణసూరు లాల్‌బన్ బజారుకు చెందిన జబీవుల్లా అనే స్వామిజీ వద్దకు తీసుకెళ్ళాడు. సదరు యువతిని స్వామిజీ పరీక్షించి.,. ఆమెపై మంత్రాలు ప్రయోగించారని, దెయ్యం […]

Continue Reading

ఇద్దరు బిడ్డలతో కలిసి నదిలోకి దూకిన మహిళ

హైదరాబాద్ : ఇద్దరు బిడ్డలతో కలిసి మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తల్లి నాగస్వరూపారాణి మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని పశ్చిమగోదావరి జిల్లా మార్తాండ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు […]

Continue Reading

మేడ్చల్‌లో దారుణం..12 ఏళ్ల బాలికను 23 ఏళ్ల వాడికిచ్చి..

బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్‌కు కూతవేట దూరంలోనే దారుణం జరిగింది. మేడ్చల్ జిల్లాలో 12 ఏళ్ల బాలికను 23 ఏళ్ల వాడికిచ్చి కట్టబెట్టారు. కరోనా సమయంలో జరిగిన ఈ పెళ్లికి 50 మంది తగుదుమమ్మా అని మూతిగుడ్డలు కూడా కట్టుకోకుండా హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. బాలల హక్కుల సంఘం కార్యకర్త అచ్యుతరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లి సమీపంలోని కొండ్లకోయ మాతా ఆలయలంలో జూన్ 1న […]

Continue Reading

మర్డర్ ప్లాన్: అఖిలప్రియ రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిందంట!

సీమలో ఉన్నపలంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తనను చంపాలని చూస్తుందని, తన హత్యకు కుట్రపన్నిందని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీమ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ విషయంలో పోలీసులు వారిపని వారు చేయగా.. నిందితులు నిజాలు వెల్లడించారని.. ఇది కచ్చితంగా అఖిలప్రియ ప్లానే అని కన్ ఫాం చేస్తున్నాయి తాజా పరిస్థితులు.. అని చెబుతున్నారు ఏవీ సుబ్బారెడ్డి! భుమా […]

Continue Reading

మంత్రిని టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లా వేంకటగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత, ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఒకసారి ఆయన వార్తల్లో ఇదే విధంగా నిలిచారు. ఇప్పుడు మరోసారి ఆయన రెండు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు ఆయన. నియోజకవర్గంలో […]

Continue Reading

భారత మార్కెట్లోకి ‘శాంసంగ్ గెలాక్సీ ఎ31’

న్యూఢిల్లీ: ‘గెలాక్సీ ఎ30’కి సక్సెసర్‌గా తీసుకొచ్చిన ‘గెలాక్సీ ఎ31’ను శాంసంగ్ భారత్‌లో లాంచ్ చేసింది. వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. 6జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. గెలాక్సీ ఎ31 6జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 21,999 మాత్రమే. నేటి నుంచే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో […]

Continue Reading

ర్యాలీకి బ్రేక్‌.. నష్టాలతో ముగింపు

ముంబై: ఆరు రోజుల పాటు వరుసగా లాభాలు తెచ్చిన దేశీయ స్టాక్‌మార్కెట్లకు చివరకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 129 పాయింట్లు నష్టపోయి 33,981 వద్ద ముగియగా.. నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 వద్ద ముగిశాయి. చాలా మంది ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు మధ్యాహ్నం నుంచి నష్టాలకు చేరువడం ప్రారంభించాయి. ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ఫార్మా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు కొంతవరకు పుంజుకోగా, ప్రైవేట్‌ బ్యాంకులు, రియల్టీల షేర్లు వెనకడుగు వేశాయి. నిఫ్టీలో […]

Continue Reading

సీఎం చెప్పినా వినరా…మళ్లీ గళం విప్పిన ఆనం

వరుసగా రెండో రోజు కూడా వెంకటగిరి ఎంఎల్ఎ అనం రాంనారాయణ రెడ్డి అధికారులపై ఫైర్ అయ్యాడు.వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రావూరులో అయన అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయా లేక 174 ఉన్నాయా అని ప్రశ్నించారు. వెంకటగిరి అసలు రాష్టంలో లేదా అని ప్రశ్నించారు.జిల్లాలో సోమశిల నీటి ని అమ్ముకుంటున్నారా నీటి లెక్కలు తెలియడం లేదా అని అగ్రహం వ్యక్తం చేసారు. సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్ గురించి సియం […]

Continue Reading