తెలంగాణలో దారుణం.. అనుమానంతో తండ్రిని కొట్టి చంపిన కొడుకు..

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కన్న తండ్రిని ఓ కొడుకు కర్రతో మోది చంపాడు.రుద్రూర్ మండలం అంభం గ్రామానికి చెందిన గుంజురు గంగారం(58)కు గంగాధర్ అనే కొడుకు ఉన్నాడు. గంగాధర్ భార్యతో గంగారం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ అనుమానంతోనే రాత్రి గంగారం పశువలపాకలో నిద్రిస్తుండగా కర్రతో తండ్రి తలపై గంగాధర్ కొట్టి చంపాడు. దీనితోపాటు ఆస్తి విషయంలో తరచూ తండ్రి కొడుకులకు గొడవలు జరిగేవని పోలీసులు […]

Continue Reading

గోదాంపై విజిలెన్స్‌ దాడులు.. నకిలీ విత్తనాలు సీజ్‌

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లాలోని కండ్లకోయ వద్ద ఇకో అగ్రీసీడ్స్‌ కంపెనీ గోదాంపై విజిలెన్స్‌ అధికారులు నేడు రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో అధికారులు నకిలీ జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న విత్తనాలను గుర్తించారు. నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు గోదాంను సీజ్‌ చేశారు. పట్టుబడ్డ నకిలీ విత్తనాల విలువ రూ. 31 లక్షలుగా సమాచారం.

Continue Reading

సీఎం ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చించి. ఆయన ఉంటున్న ఇంటికి, సచివాలయానికి బాంబు ఉందంటూ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సీఎం ఇంట్లోనే బాంబ్ ఉందంటూ ఫోన్ రావడంతో పోలీసులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. తరువాత ఓ ఆకతాయి కుర్రాడు కావాలని ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించాడని తెలిసుకొని ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌తో ఎందుకైనా మంచిదని సీఎం ఇంటికి, సచివాలయానికి భద్రతను పెంచారు. […]

Continue Reading

ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి..హోటల్లో గ్యాంగ్‌రేప్

గ్రామాల్లో ఉంటున్న యువతులను ఉద్యోగాల పేరుతో పట్టణాలకు తీసుకెళ్లి లైంగికంగా హింసిస్తున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఇంటి ఓ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ యువతిని తన మేనత్త ఉద్యోగం పేరుతో ప్రలోభపెట్టిన పట్టణానికి తీసుకుని రాగా కొందరు కామాంధులు ఆమెను ఓ హోటల్‌లో నిర్బంధించి రెండు నెలలుగా గ్యాంగ్ రేప్ కి పాల్పడుతున్నారు. ఈ దారుణ ఘటనపై సామాజిక కార్యకర్త రీనా రౌత్రాయ్ ముఖ్యమంత్రి నవీన్ […]

Continue Reading

ఒక్క ఉదుటున వచ్చి కొబ్బరిచెట్టును దగ్ధం చేసిన మెరుపు

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో నిసర్గ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా గుజరాత్ లోని భావనగర్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. భావ్‌నగర్‌లోని పాలితానా పట్టణంలో ఒక చెట్టు మీద మెరుపు పడింది. దాంతో కొబ్బరిచెట్టు మంటల ధాటికి పూర్తిగా దగ్ధమైంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనిని ప్రత్యక్షగా చూసిన వ్యక్తి ఇలా అన్నారు ‘భారీగా […]

Continue Reading

తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములు..

బులియన్ మార్కెట్లో ఈ వారం బంగారం ధరలు తగ్గాయి. ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసిన పసిడి ధర ఈ రోజు కాస్త తగ్గింది. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.50 వరకు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,170కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,070కి క్షీణించింది. ఢిల్లీ మార్కెట్లో బంగారం […]

Continue Reading

జులై చివరినాటికి ‘నాడు-నేడు’ పూర్తి

అమరావతి: జులై చివరినాటికి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. విద్యాశాఖలో నాడు-నేడు అమలుపై మంత్రి సురేశ్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమం మొదటి దశలో రూ. 3,700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీని కింద ఇప్పటికే అనేక చోట్ల పనులు ఊపందుకున్నాయన్నారు. తొలి దశలో 15,700 పాఠశాలల్లో మౌలిక వసతులు, 500 కొత్త కళాశాలలు ఏర్పాటు […]

Continue Reading

వరుస లాభాలు : పటిష్ట ముగింపు

వరుసగా ఆరో సెషన్లోనూ లాభాలు 10 వేల ఎగువన నిఫ్టీ ముగింపు సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుసగా ఆరు సెషన్లుగా దూకుడు మీద ఉన్న సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. ఆరంభ భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ చివరకు సెన్సెక్స్ 34100కు ఎగువన, నిఫ్టీ 10వేల స్థాయికి ఎగువన ముగియడం విశేషం.

Continue Reading

ఎల్లుండి నుండి జన్ ధన్ ఖాతాల్లో రూ.500.!

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలో మరో విడత రూ.500 జమ కానున్నాయి. జూన్ 5 నుండి జూన్ 10 వరకు వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా ప్రజలను ఆర్థికంగా ఆదుకోడానికి కేంద్రం అందిస్తున్న సహాయం లో భాగంగా చివరి విడతలో భాగంగా డబ్బులు జమ చేయనుంది. కాగా మొదటి రెండు విడతల్లో ఖాతాల్లో డబ్బులు వేసిన కేంద్రం ఈ సరి […]

Continue Reading

దర్శనానికి వారికి అనుమతి లేదు… నడిచి వెళ్లాల్సిందే…!!

జూన్ 8 వ తేదీ నుంచి దేవాలయాలలో భక్తులకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని కోసం దేవాలయాలకు సంబంధించిన అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తిరుమలలో పాటుగా తెలంగాణలో యాదాద్రికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇందులో దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా కారణంగా దాదాపుగా రెండు నెలలపాటు భక్తులు దేవాలయాలకు దూరంగా ఉన్నారు. అయితే, జూన్ 8 వ తేదీ నుంచి భక్తులు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. దేవాలయాల్లో తప్పనిసరిగా సోషల్ […]

Continue Reading