‘కరోనా సూట్‌’లో వచ్చి దర్జాగా ఏటీఎం దోపిడీ

కరోనా సమయాల్లో కూడా కొందరు దొగతనాలకు పాల్పడుతున్నారు. ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏటీఎం నుంచి 8 లక్షలు దొంగిలించాడు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. నగరంలోని ఎమ్ఎమ్‌డీఏ రోడ్డులోని ఓ ఏటీఎంను శానిటైజ్ చేస్తానంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏటీఎంను శానిటైజ్ చేయాలని చెప్పాడు. అతడి వీపుకు ఉన్న డిస్‌ఇన్ఫెక్టెంట్ యంత్రాన్ని చూసిన ఏటీఎం సెక్యురిటీ గార్డు నిందితుడి చెప్పినదంతా నమ్మి ఏటీఎం లోపలికి అనుమతించి తాను బయట […]

Continue Reading

మద్యం మత్తులో సజీవంగా పూడ్చిపెట్టేశాడు..

నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ మహిళను బలిగొంది. మద్యం మత్తులో ఓ మహిళను కొట్టి సజీవంగా పూడ్చిపెట్టాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. కొడవలూరులోని గొట్లపాలెం గ్రామంలో పొన్నూరు సుభాషిణి అనే మహిళ సాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి మద్యం సేవించి గొడవపడ్డారు. ఆ ఘర్షణలో సాములు కర్రతో గట్టిగా కొట్టడంతో.. సుభాషిణి సృహ కోల్పోయింది. వెంటనే ఆమెను పొదల్లో గుంత తీసి పూడ్చిపెట్టి.. కూతురిని బెదిరించి పారిపోయాడు. […]

Continue Reading

సైబర్ నేరగాళ్ల సరికొత్త దందా

హైదరాబాద్ : శాంసంగ్ గేలాక్సీ, గేలాక్సీ ఎస్ 10, యాపిల్, మైక్రోమ్యాక్స్, మాక్ బుక్, ల్యాప్ టాప్ లు, వన్ ప్లస్ వంటి ఫోన్లు చాలా తక్కువ ధరకు ఇస్తామంటారు. అటువంటి వాటిని నమ్మి మోసపోకండి. వినియోగదారులకు ఆన్ లైన్ లో సరికొత్త ఆఫర్లను ఎర వేసి నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు . వినియోగదారుల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో ఇలాంటి ప్రకటనలు చూసి ఆశపడే వారిని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.. తక్కువ […]

Continue Reading

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కార్

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో అంతా అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అవును.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేయడంపై.. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌ గా తమిళనాడుకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి. కనగరాజ్‌ ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన […]

Continue Reading

మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం..

అమరావతి: ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ సమర్పించారు. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో తెలిపారు. […]

Continue Reading

ఏపిలోకి నైరుతి రుతుపవనాలు

విజయవాడ: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తాకాయి. కేరళ రాష్ట్రం నుంచి సోమవారం నైఋతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించినట్లు విజయవాడ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్ దీవులు, మాల్దీవులు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలలోనికి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది.

Continue Reading

జగన్‌తో విభేదాల వార్తలపై విజయసాయి క్లారిటీ

అమరావతి: తాను చనిపోయేవరకు సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనను శంకించాల్సిన పనిలేదన్నారు. ”నాకు, మా అధ్యక్షుడు జగన్‌కి ఎలాంటి విభేదాలు లేవు..రావు” అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థని కించపరిచే ఉద్దేశంగానీ.. అగౌరవపరిచే ఉద్దేశం ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు లేదని చెప్పారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డగోలుగా పెట్టిన పోస్టులకు.. కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి ఉంటే ఎన్ని జైళ్లు అయినా సరిపోవని […]

Continue Reading

ఏపీ సచివాలయాన్ని కుదిపేస్తున్న కరోనా

అమరావతి: సచివాలయాన్ని కరోనా కుదిపేస్తోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రావడంతో 84 మంది ఉద్యోగులకు 2 వారాల పాటు వర్క్‌ఫ్రమ్‌ హోంకు వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్‌ పూనం మాలకొండయ్య అనుమతి ఇచ్చారు. సచివాలయంలో వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఉద్యోగులను తీసుకొచ్చేందుకు ఇక్కడినుంచి 10 ఆర్టీసీ బస్సులు వెళ్లాయి. వాటిలో వచ్చిన ఉద్యోగుల్లో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. అందులో ఒకరు సచివాలయంలో పని […]

Continue Reading

వెబ్‌సైట్‌లో సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు: మంత్రి

విజయవాడ: గ్రామ సచివాలయ పరిధిలో ఎవరైనా ఇసుక కావాలంటే ఆ గ్రామ సచివాలయంలో బుకింగ్‌ చేసుకోవచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు, మైనింగ్‌ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Continue Reading

పంటల ప్రణాళికపై సీఎం సమీక్ష

తాడేపల్లి: ఈ-క్రాపింగ్‌ మీద సమగ్ర విధివిధానాలను, ఎస్‌ఓపీలను వెంటనే తయారుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పంటల ప్రణాళిక, ఈ-మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులకు కొన్ని మార్గదర్శకాలు చేశారు

Continue Reading