పైపైన ఆడిటింగ్‌.. సంక్షోభానికి కారణం

 పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)లో సంక్షోభానికి ఆడిటర్ల తీరే కారణమని బ్యాంకు ఎండీగా సస్పెన్షన్‌కు గురైన 8News:జాయ్‌థామస్‌ ఆరోపించారు. సమయాభావంతో బ్యాంకు పుస్తకాలను పైపై ఆడిటింగ్‌ చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌బీఐకి ఆయన ఐదు పేజీల లేఖను రాశారు. వసూలు కాని బకాయిలను (ఎన్‌పీఏలు) వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపించడం వెనుక బ్యాంకు యాజమాన్యం, డైరెక్టర్ల పాత్ర ఉన్నట్టు థామస్‌ అంగీకరించారు. అలాగే, పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ పుస్తకం […]

Continue Reading

నేటి నుంచే రుణ మేళాలు

8News:ప్రభుత్వం ప్రకటించిన రుణ మేళా కార్యక్రమాలు గురువారం నుంచి దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ప్రారంభమవుతాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలతో కలసి వీటిని నిర్వహిస్తాయి. రిటైల్‌ కస్టమర్లతోపాటు వ్యాపారస్థులకు కూడా రుణాలను అప్పటికప్పుడు మంజూరు చేయడమే వీటి నిర్వహణ ఉద్దేశ్యం. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వ్యవసాయ రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలు) వ్యాపార పరమైన రుణాలను బ్యాంకులు అందించనున్నాయి. ముఖ్యమైన పండుగల సమయంలో రుణాల మంజూరీని పెంచడం […]

Continue Reading

నిబంధనలకు విరుద్ధంగా జియో రూల్స్ … చేసేదేమి లేక జియో బాటలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా

8News:ఇక పై ఫోన్ కాల్ రింగింగ్ టైం తగ్గనుంది. ఇంతకు ముందు 35-40 సెకన్లు ఉండే రింగింగ్ టైం ఇక పై 25 సెకన్లకు కుదించారు . దీనిపై తాజాగా భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటన చేశాయి.. అయితే, దీని వెనక జియోనే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జియో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి నిబంధనలకు విరుద్ధంగా రింగింగ్ సమయాన్నిమొదట 20 సెకన్లకు తగ్గించింది.. ఆ తర్వాత మరో 5 సెకన్లు జోడించి ఆ […]

Continue Reading

మెసేజ్ ఎంత సమయం కనిపించాలి అంతా మన చేతుల్లోనే!

8News:ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫీచర్లన్నిటితో పోలిస్తే ఈ ఫీచర్ చాలా ప్రత్యేకం. సాధారణంగా వాట్సప్‌లో మీరు ఎవరికైనా మెసేజ్ పంపిస్తే డిలిట్ చేసే అవకాశం గతంలో ఉండేది కాదు. కానీ… ఆ తర్వాత మెసేజ్‌ను డిలిట్ చేసే ఫీచర్ అందించింది వాట్సప్. ఇప్పుడు కొత్తగా ‘డిసప్పియరింగ్ మెసేజెస్’ ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా 2.19.275 వర్షన్‌లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు. […]

Continue Reading

ఢిల్లీలో ఎదురుకాల్పులు…ముగ్గురు నేరస్థుల అరెస్ట్

8News:ఢిల్లీలో కరడుకట్టిన ముగ్గురు నేరస్థులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన గురువారం వెలుగుచూసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ముగ్గురు నేరస్థులు కారులో వస్తుండగా ఢిల్లీ పోలీసులు వాహనం ఆపాలని కోరారు. కారులో ఉన్న నేరస్థులు కారు ఆపకుండా వేగంగా వెళుతూ పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు తిరిగి కాల్పులు జరిపి ముగ్గురు నేరస్థులను పట్టుకున్నారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదు

8News:మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌పై కేసు నమోదైంది. క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని భార్గవ్‌రామ్ బెదిరించారని శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భార్గవ్‌రామ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

వణికిస్తున్న .. విషజ్వరాలు .. 13మంది మృతి..

8News:వాతావరణ మార్పుల వల్ల చిత్తూరు జిల్లాను డెంగీ, విషజ్వరాలు వణికిస్తున్నాయి. పల్లె నుంచీ పట్నం వరకూ జ్వరంతో బాధపడుతూ మంచం పడుతున్నారు. రెండు నెలల వ్యవధిలో దాదాపు 13 మంది మృత్యువాతపడ్డారు. అయితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం విషజ్వరాలు, డెంగీ ఉన్నమాట వాస్తవమేనని, అయితే డెంగీతో ఎవరూ చనిపోలేదంటూ బుకాయిస్తుండటం గమనార్హం. ఇదే అదనుగా ‘ డెంగీ ‘ని బూచిగా చూపుతూ ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచీ అందినకాడికీ దండుకుంటున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయాయంటూ హడలెత్తించి, […]

Continue Reading

ఆ వివాదం తారాస్థాయికి చేరడంతో.. కన్నతండ్రినే కసితీరా నరికిన కొడుకులు..

8News:రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావంటే.. నేను ఎవరి మధ్యనైనా ఇట్టే తగువు పెట్టి విడగొతాను అని చెప్పిందట. ఆ నలుగురు సినిమాలో డైలాగ్ ఇది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే కనిపిస్తాయి. ఆస్తుల కోసం రక్త సంబంధీకులను సైతం హత్య చేయడానికి వెనుకాడని ఘటనలు.తాజాగా తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం గూడూరు పంచాయతీలోని దొండగూడెంలో ఇలాంటి ఘటనే జరిగింది.ఆస్తి పంకాల విషయంలో తలెత్తిన ఓ వివాదంలో కన్నతండ్రినే చంపేశారు ఇద్దరు కొడుకులు. […]

Continue Reading

ఆ విషయంలో ప్రియుడికి కూడా మినహాయింపు ఇవ్వని నయనతార

8News:ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నయనతారకి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. వరుస సినిమాలు చేసుకుంటూ అంచలంచలుగా ఎదిగి లేడీ సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది నయనతార. ఏదో ఒక ఇండస్ట్రీలోనే కాదు తెలుగు తమిళ్ మలయాళం ఇలా వివిధ భాషల్లో నటిస్తూ తన హవా నడిపిస్తుంది నయనతార. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన నయనతార… ఇటు సీనియర్ హీరోలు కుర్ర హీరోల పక్కన మెరుస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ కెరియర్ […]

Continue Reading

వెంకీ మామా సినిమాకు బడ్జెట్ టెన్షన్ పట్టుకుందా..!

8News:నిజ జీవితంలో మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య కలసి మామా అల్లుళ్లుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామా. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, చైతూ సరసన రాశీ ఖన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. కే.ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. […]

Continue Reading