చిమ్మచీకటి.. గూగుల్ మ్యాప్సే ఆధారం.. ఇంతలో అనూహ్యంగా..

న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్..కొత్త ప్రదేశానికి వేళ్లాలనుకునేవారి మార్గదర్శి! దీని ద్వారా ఎందరో నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే..గూగుల్ మ్యాప్స్‌ చూపించే దారిలోనే ప్రయాణిస్తూ ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ గులే అనే వ్యక్తి గురుశేఖర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరికీ అంతకుమనునపే పరిచయం ఉంది. కొవిడ్ కారణంగా సతీశ్ ఉద్యోగం కోల్పోవడంతో అతడిని గురుశేఖర్ తన వద్ద డ్రైవర్ ఉద్యోగం ఇచ్చాడు.

Continue Reading

కడప జిల్లా ముద్దనూరులో రోడ్డుప్రమాదం

కడప జిల్లా ముద్దనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ముద్దనూరు నుండి చిన్న దుద్యాల గ్రామానికి వెళ్తున్న ఆటోను పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

జగిత్యాల జిల్లాలో ఘోర సంఘటన

Man Commits Suicide: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర సంఘటన జరిగింది. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలంలోని నూకపల్లిలో జగిత్యాల-కరీనంగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న 130 కేవీ కరెంట్‌ టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ కావడంతో మృతదేహం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించారు. పోస్టుమార్టం […]

Continue Reading

కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు

నాగర్‌కర్నూల్‌ : హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు మండలంలోని కొండారెడ్డి పల్లి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుస్సేన్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..జిల్లాలోని ఉప్పునుంతల మండలం రాయిచేడి గ్రామానికి చెందిన హుస్సేన్ తన కూతురును కల్వకుర్తి గురుకుల పాఠశాలలో పరీక్ష రాయించి తిరుగు ప్రయాణమయ్యాడు. కాగా, తన ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కూతురుకు స్వల్ప […]

Continue Reading

లిఫ్ట్‌గుంతలో పడి వాచ్‌మన్‌ మృతి

మియాపూర్ : నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మన్‌గా పనిచేస్తూ విధి నిర్వహణలో ఉండగా.. ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి లిఫ్ట్‌గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌నగర్‌ ధర్మారెడ్డికాలనీలో వాసం షెట్టి త్రిమూర్తులు(41) భార్య, కుమారుడితో కలిసి నివాసముంటూ స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం రాత్రి 11.30గంటల సమయంలో భవనం […]

Continue Reading

వాహనంతో తొక్కించి మహిళ హత్య

పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువు వారిని తన వాహనంతో ఢీకొట్టాడు. అంతటితో ఆగక మీదికెక్కించి మహిళను అంతమొందించాడు. గాయాలతో తప్పించుకున్న ఆమె భర్త, కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యంత హేయమైన ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంచలనం రేపింది

Continue Reading

యువకుల వేధింపులు.. బస్సాపని డ్రైవర్! మరోదారిలేక ఆ బాలికలు..

లక్నో: బస్సులో ఆకతాయిల వేధింపులు తట్టుకోలేని ఇద్దరు బాలికలు బస్సాపండి అంటూ డ్రైవర్‌ను వేడుకున్నారు. వారి వేధింపులు భరించలేకున్నాము..దిగిపోతామంటూ కాళ్లావేళ్లాపడ్డారు. కానీ డ్రైవర్ మాత్రం ససేమిరా అన్నాడు. యువకుల వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన ఆ ఇద్దరు బాలికలు మరోదారిలేక దారుణ నిర్ణయం తీసుకున్నారు. వేగంగా వెళుతున్న బస్సు నుంచి అమాంతం కిందకు దూకేశారు. దీంతో ఒకరి తలకి గాయాలవగా మరొకరి కాలి ఎముక విరిగిపోయింది. మనసును కలిచివేసే ఈ ఉదంతం గురువారం గ్రేటర్ […]

Continue Reading

గవర్నర్ పదవి ఇప్పిస్తానంటూ రిటైర్డ్ జడ్జికి రూ.8.8 కోట్లు టోకరా

బెంగళూరు : గవర్నర్ పదవిపై ఆశపెట్టుకున్న రిటైర్డ్ జడ్జి దారుణంగా మోసపోయారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయంటూ ఓ మోసగాడు ఆ రిటైర్డ్ జడ్జి నుంచి దాదాపు రూ.8.8 కోట్లు కొట్టేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. బెంగళూరు నగర క్రైమ్ బ్యూరో (సీసీబీ) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోసగాడిని గుర్తించారు. సీసీబీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హెచ్ఎం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ, బాధితురాలు, రిటైర్డ్ జడ్జి గత ఏడాది డిసెంబరు 21న విల్సన్ గార్డెన్ […]

Continue Reading

కారు, బైక్‌ ఢీకొని తల్లీకొడుకు మృతి

పెద్దపల్లి : కారు, బైక్‌ ఢీకొని తల్లీకుమారుడు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగపల్లి గ్రామానికి చెందిన దబ్బేట నాగరాజు (23) తల్లి రాజేశ్వరి (50) తో కలిసి బైక్‌పై మంథని వైపు వెళ్తున్నాడు. బట్టుపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి […]

Continue Reading

రామంతాపూర్ నేహ్రూ నగర్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం…

రామంతాపూర్ నేహ్రూ నగర్ లోని శ్రీనివాస మిల్క్ పార్లర్ లో ఉన్న రుత్విక్ యాదవ్ (8 ) అనే చిన్నారి బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి మభ్యపెట్టి షాప్ లోంచి రూ .ఐదు వెయ్యిలను తీసుకోవడంతో పాటు తన ద్విచక్ర వాహనంపై చిన్నారిని తీసుకుని వెళ్ళడంతో స్థానికంగా బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది .దీనితో బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి చుట్టు పక్కలా వెతికారు .అయితే గంట తరువాత తిరిగి తల్లితండ్రి దగ్గరకు చేరుకున్న […]

Continue Reading