దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు..

దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందించాయి. రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడుగా సాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 689 పాయింట్లు జంప్‌చేసి 48,782 వద్దకు చేరగా నిఫ్టీ సైతం 209 పాయింట్లు ఎగసి 14,347 వద్ద స్థిరపడ్డాయి. పది రోజుల వరుస ర్యాలీకి గత రెండు రోజుల్లో బ్రేక్‌ పడినప్పటికీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల […]

Continue Reading

తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు!

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.5 మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిపై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 50 శాతం మేర తగ్గించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెట్రోల్ ధరలు కనీసం రూ.5 వరకూ తగ్గనుంది. ఈ మధ్యే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు కొత్త రికార్డును తాకిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో తొలిసారి పెట్రోల్ ధర లీటర్‌కు రూ.84 దాటిపోయింది. ఇలాంటి […]

Continue Reading

గోల్డ్ మార్కెట్‌పై కరోనా ప్రభావం… పదేళ్ల కనిష్టానికి చేరుకున్న బంగారం దిగుమతులు

కరోనా గోల్డ్ మార్కెట్‌పై కూడా తీవ్రంగా ప్రభావం చూపిందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మన దేశంలో బంగారం దిగుమతులు పదేళ్ల కనిష్టానికి పడిపోయాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ వల్ల ఆభరణాలకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. ధరలు కూడా ఎక్కువగా ఉండటంతో బంగారాన్ని కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపలేదు. దీంతో 2020లో దిగుమతులు 275.5 టన్నులకు పడిపోయినట్లు గోల్డ్ కౌన్సిల్ డేటా వెల్లడించింది. గతంలో 2009లోనే విదేశీ కొనుగోళ్లు ఇంత […]

Continue Reading

పెట్రోల్ ధర పైకి…డీజిల్‌ రేటుదీ ఇదే దారి

29 రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన దేశీ ఇంధన ధరలు ఈరోజు పైకి కదిలాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త ఏడాదిలో తొలిసారి పెరిగాయి. పెట్రోల్ ధర 28 పైసలు, డీజిల్ ధర 28 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర రూ.87.34కు, డీజిల్ ధర రూ.80.88కు చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.90.19కు చేరింది. డీజిల్‌ ధర 27 […]

Continue Reading

దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగింపు..

దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. గత కొద్దిరోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్తున్న దేశీ సూచీలు ఏడాది చివరిరోజును మాత్రం సాదాగా ముగించాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారి జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 14 వేల మైలు రాయిని దాటినప్పటికీ ఇన్వెస్టర్ల అప్రమత్తతతో చివరకు 13,981 వద్ద ముగిసింది. అటు బాంబే స్టాక్ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ సైతం 5 పాయింట్ల స్వల్ప లాభంతో 47,751 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే […]

Continue Reading

గుడ్‌న్యూస్‌ చెప్పిన జియో.. మళ్లీ అన్నీ ఫ్రీ..!

అన్నీ ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 2021 న్యూ ఇయర్ రాబోతున్న తరుణంతో తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది… 2021 జనవరి 1 నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది జియో.. మొదట డేటా, కాల్స్ ఫ్రీ అంటూ కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన జియో.. ఆ తర్వాత టారిఫ్‌ అమలు చేసినా.. డేటాకు మాత్రమే ఛార్జీ విధించి ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ ఫ్రీగా […]

Continue Reading

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లకు తోడు దేశీ ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడుల వెల్లువ సరికొత్త జోష్‌ను అందించినట్లయింది. ఫలితంగా వీకెండ్ సెషన్‌లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 227, నిఫ్టీ 73 పాయింట్ల మేర లాభాలతో శుభారంభాన్ని అందించాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు ఎగసి 46 వేల 99 వద్దకు చేరగా, నిఫ్టీ 35 పాయింట్ల మేర లాభంతో 13 వేల 5 వందల 13 వద్ద […]

Continue Reading

తగ్గిన బంగారం, వెండి ధరలు..

బలహీనమైన ప్రపంచ ధోరణిపై బుధవారం బంగారు ధరలు దేశ రాజధానిలో 10 గ్రాములకు రూ .118 తగ్గి 49,221 రూపాయలకు చేరుకున్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. మునుపటి ట్రేడ్‌లో విలువైన లోహం 10 గ్రాముకు రూ .49,339 వద్ద ముగిసింది. వెండి ధరలు కూడా గత ట్రేడ్‌లో కిలోకు రూ .64,285 నుంచి రూ .875 తగ్గి రూ .63,410 కు చేరుకున్నాయి. “బలహీనమైన ప్రపంచ బంగారు ధరలు మరియు ఫ్లాట్ రూపాయికి అనుగుణంగా ఢిల్లీలో 24 […]

Continue Reading

భారీ లాభాల్లో ముగిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు సరికొత్త గరిష్టాన్ని తాకాయి. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను పడిపోకుండా చివరి వరకు అలాగే కొనసాగాయి. మధ్యాహ్నం సెషన్ వరకు 45,200 స్థాయిలో ట్రేడ్ అయిన సెన్సెక్స్, 12 గంటల తర్వాత 45,300 స్థాయికి చేరుకొన్నాయి. ఆ తర్వాత 45,200 కిందకు పడిపోలేదు. ఓ సమయంలో 44,450 సమీపానికి చేరుకొని, చివరకు 350 పాయింట్ల లాభంతో ముగిసింది. ఫైనాన్షియల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించాయి. […]

Continue Reading

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. వడ్డీరేట్లను యధాతథంగా ఉంచడంతో పాటు ఆర్బీఐ కొంత సర్దుబాటు ధోరణి కనబర్చడంతో దేశీయ సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ స్టాక్‌ల దూకుడుతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 446.90 పాయింట్ల (1 శాతం) లాభంతో 45,079.55 వద్ద క్లోజ్ అయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం 124.60 పాయింట్లు (0.95 శాతం) బలపడి 13,258.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, […]

Continue Reading