ఐపీఎల్‌ ప్రతిపాదన చేయలేదు

వెల్లింగ్టన్‌: ఐపీఎల్‌ టోర్నీకి తాము ఆతిథ్యమిస్తామన్న ప్రతిపాదన చేయలేదని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు(ఎన్‌జడ్‌సీ) స్పష్టం చేసింది. భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికకు(ఎఫ్‌టీపీ) తాము కట్టుబడి ఉన్నామని ఎన్‌జడ్‌సీ అధికార ప్రతినిధి రిచర్డ్‌ బుక్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. దీనిపై రిచర్డ్‌ మాట్లాడుతూ ‘ఐపీఎల్‌ నిర్వహణపై వస్తున్న వార్తలు నిరాధారమైనవి. లీగ్‌ నిర్వహించే పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ లేదు. ఆతిథ్యానికి మమ్మల్ని అడిగినా..మేము నిర్వహించబోం’ అని అన్నాడు.

Continue Reading

హంపి, హారిక ఓటమి

చెన్నై: ఫిడే మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప లెగ్‌-3లో భారత్‌ పోరాటం ముగిసింది. ఆన్‌లైన్‌లో గురువారం జరిగిన క్వార్టర్స్‌లో కోనేరు హంపి 2-9 స్కోరుతో అలెగ్జాండ్రా కోస్టెనిక్‌ (రష్యా) చేతిలో ఓడింది. మరో గేమ్‌లో ద్రోణవల్లి హారిక 2-9 స్కోరుతో హో యిఫాన్‌ (చైనా) చేతిలో పరాజయం ఎదుర్కొంది. ఆర్‌.వైశాలి తొలి రౌండ్‌లోనే హంపి చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 15న జరగనున్న ఆఖరి, నాలుగో లెగ్‌లో హంపి, హారిక, వైశాలి అదృష్టాన్ని […]

Continue Reading

విండీస్ బౌలర్ల ధాటికి కష్టాల్లో ఇంగ్లండ్

బయో సెక్యూర్ వాతావరణంలో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండోరోజు ఆసక్తికరంగా మారింది. తొలిరోజు వర్షం కారణంగా కేవలం 17.4 ఓవర్లపాటు మాత్రమే మ్యాచ్ కొనసాగగా ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టును విండీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. షానన్ గాబ్రియేల్ రెండు వికెట్లు తీశాడు. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే షానన్ గాబ్రియేల్ బౌలింగ్‌లో జో డెన్లీ (58 […]

Continue Reading

గంభీర్ కు దొరికింది నాకు దొరకలేదు : దాదా

కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్ కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్‌కు స్వేచ్ఛను ఇచ్చారని. కానీ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో తనకు అది లభించలేదని భారత మాజీ కెప్టెన్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. దాదా 2008, 2010 లో కేకేఆర్ కు నాయకత్వం వహించాడు. ఇక గౌతమ్ గంభీర్ 2011 ఐపీఎల్ ఎడిషన్‌లో గంగూలీ నుంచి ఆ బాధ్యతలు స్వీకరించి 2012 మరియు 2014 […]

Continue Reading

గవాస్కర్ కు మళ్ళీ ఆ రెండు సీట్లు…

భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ గురించి అందరికి తెలుసు. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడు ఆయనే. అందుకే అటువంటి ఆటగాడికి వాంఖడే స్టేడియం లో రెండు శాశ్వాత సీట్లు కేటాయించారు అధికారులు. అయితే గవాస్కర్ తన టెస్ట్ క్రికెట్ కు ఏ పెవిలియన్ నుండి అయితే వీడ్కోలు పలికాడో అందులోనే రెండు సీట్లు… గవాస్కర్ కు ఒకటి, ఆయన సతీమణికి మరొకటి కేటాయించారు. కానీ 2011 ముందు ఆ స్టేడియంలో […]

Continue Reading

గంగూలీనే బెస్ట్ కెప్టెన్: వసీం జాఫర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో సౌరవ్ గంగూలీనే బెస్ట్ కెప్టెన్ అని మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నారు. గంగూలీ సారథ్యంలో భారత్ ఓ గొప్ప జట్టుగా ఎదిగిందని, ఎన్నో మరుపురాని విజయాలను సొంతం చేసుకుందని పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వసీం జాఫర్ గంగూలీపై ప్రశంసల వర్షం కురిపించారు. గంగూలీ గొప్ప ఆటగాడని, 2000వ సంవత్సరంలో ఫిక్సింగ్ ఆరోపణలతో భారత క్రికెట్ అతలాకుతలమైందని, అలాంటి సమయంలో కెప్టెన్సీ చేపట్టిన గంగూలీ జట్టు రూపురేకలనే మర్చేశాడని చెప్పాడు. […]

Continue Reading

ఇంట్లో కూర్చొనే కోట్లు సంపాదిస్తున్న కోహ్లీ

కరోనా కారణంగా అన్ని ఆటలు రదైపోయాయి , దీంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితం అయ్యారు , కోహ్లీ ఇంట్లో నే కూర్చొని తన ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ ను పోస్ట్ చేయడం ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు

Continue Reading

ఫెదరర్‌ను చిట్కాలు అడిగిన లిటిల్ మాస్టర్…

కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సచిన్ టెండూల్కర్ తన ఇంటి నుండి బయటికిరాలేదు. అయితే లాక్ డౌన్ సడలింపులు వచ్చిన తర్వాత తాజాగా తన స్నేహితులతో టెన్నిస్ కోర్టుకు వెళ్ళాడు లిటిల్ మాస్టర్. ముంబైలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తన స్నేహితులతో టెన్నిస్ ఆడుతున్నట్లు సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అయితే రోజర్ ఫెదరర్‌ను ఆ వీడియోకి ట్యాగ్ చేశాడు సచిన్, దాంతో పాటు ఆ టెన్నిస్ […]

Continue Reading

కోచ్ మెడపై కత్తి పెట్టిన పాక్ క్రికెటర్…క్లారిటీ ఇచ్చిన పాక్ క్రికెట్ బోర్డు!

భారత మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ మెడపై సరదాగానే అప్పట్లో బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్ కత్తి పెట్టాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకూ గ్రాంట్ ఫ్లవర్.. పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. పాకిస్థాన్ జట్టు 2016లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లగా.. బ్రిస్బేన్‌ టెస్టు మ్యాచ్‌కి ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న యూనిస్ ఖాన్‌కి గ్రాంట్ ఫ్లవర్ ఏదో బ్యాటింగ్ సలహా ఇవ్వబోయాడట. దాంతో.. చిర్రెత్తిపోయిన యూనిస్ తన మెడపై […]

Continue Reading

బంగ్లాదేశ్‌లో కివీస్‌ పర్యటన వాయిదా

ఢాకా: కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా… బంగ్లాదేశ్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు పర్యటన వాయిదా పడింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాదేశ్‌లో కివీస్‌ పర్యటించాల్సి ఉంది. గతవారం ముగ్గురు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు వైరస్‌ బారిన పడ్డారు. మాజీ వన్డే కెప్టెన్‌ మొర్తజా, నజ్ముల్‌ ఇస్లామ్, నఫీజ్‌ ఇక్బాల్‌లకు కరోనా సోకినట్లు గతవారం జరిపిన టెస్టుల్లో తేలింది.

Continue Reading