అతడి కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

గోపీచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వీరి హ్యాట్రిక్ కొట్టారు. ఈ సినిమాతో అందాల రాసి శ్రుతిహాసన్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కరోనా తర్వాత విడుదల మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమాతోనే కాకుండా మొట్టమొదటి బ్లాక్ బస్టర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిని మాస్ మహరాజ్ రవితేజ గొప్ప విజయంతో ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు […]

Continue Reading

పవన్ కల్యాణ్ మూవీకి సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్‌..!

పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ అయింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సాయిపల్లవిని వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ పొజిషన్ లో తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా..సాయిపల్లవి నో చెప్పినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇదే న్యూస్ మరోసారి లైమ్‌లైట్ […]

Continue Reading

ప్రభాస్ తో కేజీఎఫ్ డైరెక్టర్ 2 రోజులు మీటింగ్‌

కేజీఎఫ్ వంటి హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ చిత్రం చేస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ రానున్న రోజులు వరుసగా ప్రభాస్ తో సమావేశం కానున్నాడని ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ తో సలార్ రెగ్యులర్ షూటింగ్‌తోపాటు ఇతర అంశాలపై ప్రశాంత్ నీల్ డిస్కస్ చేయనున్నాడట. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఫిబ్రవరి మొదటి వారంలో సలార్ […]

Continue Reading

సంక్రాంతికి ప్రభాస్‌ ఇస్తున్న గిఫ్ట్‌ ఇదే..!

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ ‘రాధేశ్యామ్’. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రభాస్‌ అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ పూజాహెగ్డే లుక్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం ఈ సినిమా సాలిడ్‌ అప్‌డేట్‌ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి అభిమానులను ఆకట్టుకునేలా చిత్ర […]

Continue Reading

‘మాస్టర్‌’ బిజినెస్‌ ఎంత?

కోలీవుడ్ హీరో విజయ్‌, డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈ నెల 13వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘మాస్టర్‌’. ఈ చిత్రంలో మరో హీరో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించడం గమనార్హం. మాళవికా మోహన్‌, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్‌, అర్జున్‌ దాస్‌, గౌరి జి కిషన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, శ్రీమాన్‌, పూవైయార్‌ ఇతర తారాగణం నటించగా, అనిరుథ్‌ సంగీత బాణీలు సమకూర్చారు. కాగా ఈ చిత్రం బిజినెస్‌పై ఇపుడు కోలీవుడ్‌లో రసవత్తరంగా చర్చ […]

Continue Reading

రవితేజకు భారీ దెబ్బ తప్పదా.. ‘క్రాక్’కు ఎన్ని కోట్లు నష్టం..?

హైదరాబాద్ : అసలే కరోనా వైరస్.. ఆపై సినిమాలు కూడా లేవు.. అందులోనూ చాలా రోజులుగా అభిమానులు మంచి మసాలా సినిమా కోసం వేచి చూస్తున్నారు.. అలాంటి సమయంలో క్రాక్ ముందుగా వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఐదు రోజుల ముందు థియేటర్స్ లో సందడి చేస్తానని చెప్పాడు రవితేజ. దాంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుందాం అనుకున్నారు. అంతకుముందు మిరపకాయ్, కృష్ణ లాంటి సినిమాలతో పండక్కి వచ్చి విజయాలు అందుకున్నాడు మాస్ రాజా. అదే ఊపు […]

Continue Reading

కళ్యాణ్ రామ్ లిమిట్స్ దాటుతున్నాడా?

నందమూరి నటవారసుల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కానీ అతడికి తన కెరీర్‌లో పెద్ద హిట్‌లు పడలేదు. కళ్యాణ్ రామ్ చేసిన పటాస్ సినిమా కెరీర్ హిట్‌గా నిలిచింది. దాని తరువాత మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోలేదు. దాంతో ఎలాగైన సరైన హిట్ అందుకోవాలని కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తూ జోరు చూపుతున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్నడూ లేనివిధంగా భారీ బడ్జెట్ […]

Continue Reading

దుష్యంతుడు ఎవరు?

`రుద్రమదేవి` వంటి చారిత్రాత్మక చిత్రం తీసి మెప్పించిన దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం పౌరాణిక సినిమా `శాకుంతలం`పై దృష్టి సారించారు. శకుంతల క్యారెక్టర్ చేయడానికి సమంత ఓకే అనేసింది. ఇటీవల టైటిల్ మోషన్ పోస్టర్ కూడా విడుదలైపోయింది. అయితే దుష్యంతుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దుష్యంతుడి పాత్రకు దగ్గుబాటి రానాను అడిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే రానా అంగీకరించలేదని సమాచారం. దీంతో మలయాళ, తమిళ హీరోల వైపు గుణశేఖర్ చూస్తున్నారట. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా […]

Continue Reading

రికార్డులు బద్దలు కొడుతున్న ‘కేజీయఫ్‌2’ టీజర్‌

హైదరాబాద్‌: యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కేజీయఫ్‌ చాప్టర్‌2’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. శుక్రవారం యశ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో రికార్డులు బద్దలు కొడుతోంది. గురువారం రాత్రి టీజర్‌ను విడుదల చేయగా, 24గంటల కన్నా ముందే 55 మిలియన్‌ వ్యూస్‌ను దాటి దూసుకుపోతోంది. అంతేకాదండోయ్‌ 3మిలియన్లకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌లో టాప్‌లో […]

Continue Reading

సీక్రెట్‌గా ‘బస్ స్టాప్’ హీరోయిన్ పెళ్లి!

మారుతి డైరెక్ట్ చేసిన ‘బస్ స్టాప్’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటించడం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆనంది సీక్రెట్‌గా ఈ రోజు పెళ్లాడుతోందంటూ ప్రచారం గుప్పుమంటోంది. ‘బస్ స్టాప్’ మూవీ తర్వాత తెలుగులో రక్షిత పేరుతో రెండు మూడు సినిమాలు చేసినా సరైన పేరు రాకపోవడంతో ‘కాయల్’ మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమాతో కాయల్ ఆనందిగా పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె సోక్రటీస్ అనే యువకుడిని తన స్వస్థలం వరంగల్‌లో ఈ రోజు రాత్రి ఎనిమిది […]

Continue Reading