వయసు ‘చిన్న’.. ఆలోచన మిన్న!

అవసరమే ఎవరినైనా ఐన్‌స్టీన్‌ను చేస్తుంద’న్న ఓ పెద్దాయన మాట ఈ చిన్నారుల విషయంలో అక్షరాలా నిజమైంది. వాలీబాల్‌ ఆడాలనేది ఈ చిన్నారుల సరదా. నెట్‌, బాల్‌ కొనాలంటే డబ్బుల్లేవు. అలాగని ఆట మీద ఇష్టాన్ని వదులుకోలేరు. ఆ బృందంలోని మూడో తరగతి విద్యార్థి జన్ని చిన్నారావుకు వచ్చిన ఆలోచన మేరకు మిగిలిన విద్యార్థులు ఓ ఎరువుల సంచికి రంధ్రాలు చేశారు. దానిని నెట్‌లా మార్చి కర్రలకు కట్టి… ఇలా వాలీబాల్‌ ఆడాలనే తమ ముచ్చట తీర్చుకున్నారు.

Continue Reading

మాజీ మంత్రి రామస్వామి మృతి..

మాజీ మంత్రి, మహారాజ్‌గంజ్‌ మాజీ ఎమ్మెల్యే పీ.రామస్వామి(87) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన హైదరాబాద్‌ నగరంలోని మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించారు. ఆయనకు భార్య, ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన డయాలిసిస్‌ కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. డయాలసిస్‌ చేస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. రామస్వామి 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో […]

Continue Reading

హైదరాబాద్ బస్తీ దవాఖానాల్లోనూ కరోనా పరీక్షలు.. నేటి నుంచే..

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజుకు భారీగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఐతే వీటిలో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి జీహెచ్ఎంసీలో ఉన్న 167 బస్తీ దవాఖానాల్లోనూ యాంటిజెన్ కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలోని 90 ఆరోగ్య కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు బస్తీ దవాఖానాల్లోనూ […]

Continue Reading

జీహెచ్‌ఎంసీలో 918 మందికి కరోనా

రాష్ట్రంలో గురువారం కొత్త మరో 1,410 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 918 వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 125, సంగారెడ్డి 79, మేడ్చల్‌ మల్కాజిగిరి 67, వరంగల్‌ అర్బన్‌ 34, కరీంనగర్‌ 32, భద్రాద్రి కొత్తగూడెం 23, నల్లగొండ 21, నిజామాబాద్‌ 18, మెదక్‌ 17, ఖమ్మం 12, సూర్యపేట 10, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్ల 8 చొప్పున, వరంగల్‌ రూరల్‌ 7, జయశంకర్‌ భూపాలపల్లి 6, వికారాబాద్‌, మహబూబాబాద్‌లో 5 […]

Continue Reading

మద్యం అక్రమంగా తరలిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు

అమరావతి: మద్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు

Continue Reading

ఎల్‌జీ పాలిమర్స్‌ సీఈవో, ఉద్యోగులకు 14 రోజులు రిమాండ్‌

విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనకు సంబంధించి ఆ సంస్థ సీఈవో, డైరెక్టర్‌తో పాటు అరెస్ట్‌ చేసిన 12 మందిని పోలీసులు బుధవారం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు.  కోవిడ్‌–19 కారణంగా న్యాయమూర్తి జూమ్‌ యాప్‌ ద్వారా విచారణ నిర్వహించి.. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అంతకుముందు నిందితులందరికీ కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మే నెల 7న చోటుచేసుకున్న దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నట్టు హైపవర్‌ కమిటీ నిపుణుల బృందం స్పష్టం […]

Continue Reading

ప్రయివేట్‌ ఆస్పత్రుల్లోనూ కోవిడ్‌కు చికిత్స

అమరావతి: కోవిడ్‌ బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందుతుండగా ఇకపై ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వైద్యానికి అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోనూ ప్రభుత్వపరంగా కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతోంది. వైద్యం, మందుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండటంతో ఇక్కడ కూడా రోగులకు ఉచితంగా సేవలందుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్బు చెల్లించి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్న వారికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స పొందేందుకు వీలు కల్పిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. […]

Continue Reading

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్‌

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ సీఈవో సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కొందరు డైరెక్టర్లు, స్టైరిన్ మోనోమార్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2),278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనలో 12మంది మృతి చెందారు. 585 […]

Continue Reading

దేశంలో 7 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. ఒక్కరోజే 467 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ సంఖ్య ఏడు లక్షలు దాటింది. తొలి లక్ష వైరస్‌ కేసులు నమోదు కావడానికి 110 రోజులు పడితే, తర్వాత 49 రోజుల్లో ఏడు లక్షల కేసులు రికార్డయ్యాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకు కొత్తగా 22,252 మందికి పాజిటివ్‌ అని […]

Continue Reading

ఇవాళ వైఎస్సార్‌ 71వ జయంతి…ఇవే ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలు

ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి… ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే.. తన తండ్రికి నివాళులర్పించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు తన కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పిస్తారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. […]

Continue Reading