250 కోట్లతో మెగా డెయిరీ

రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.250 కోట్లతో మెగా డెయిరీని నిర్మించనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రకటించారు. దీనికి శ్రావణమాసంలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో పశుసంవర్ధకశాఖపై ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ..మెగా డెయిరీతోపాటు మామిడిపల్లిలో రూ.18.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పశు పరిశోధనకేంద్రం, పశువుల కృ త్రిమ గర్భధారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Continue Reading

ప్రగతిశీల తెలంగాణకు పెట్టుబడులతో రండి

కరోనా నేపథ్యంలో అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం తెలంగాణలోని కంపెనీలు ఉత్పత్తిచేసే ఔషధాలపై ఆధారపడుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగానికి అనుకూలమైన వ్యవస్థ బలంగా ఉన్నదని తెలిపారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ర్టాలను యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రగతిభవన్‌ నుంచి గురువారం యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబీసీ) ఇన్వెస్ట్‌మెంట్‌ వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో […]

Continue Reading

దొంగే దొంగా.. దొంగా అంటున్నాడు!

అమరావతి:  పేదలందరికీ ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పగ సాధించడమే కాకుండా, దొంగే దొంగా దొంగా అని అరచినట్లు తెలుగుదొంగల పార్టీ  నిరసన దీక్షలకు దిగుతుందట అంటూ వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి గురువారం విమర్శలు గుప్పించారు.  ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

Continue Reading

రైతులను మోసం చేసింది చంద్రబాబే

ద్రోహానికి చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అని, దగాకు పేటెంట్‌ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని రైతు బాంధవుడిగా రాష్ట్ర ప్రజలు కీర్తిస్తుంటే ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాకినాడలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కన్నబాబు ఏమన్నారంటే.. ► రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవం నిర్వహించాం. రైతు సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే […]

Continue Reading

కరోనా ఫీజు ఫైనల్ చేసిన జగన్ సర్కార్.. ఇక్కడ ఎలా ఉంటుందో..?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులన్ని కరోనా రోగుల తో నిండి ఉన్నాయి. అటు క్వారంటైన్ సెంటర్లు కూడా కరోనా కరోనా అనుమానితులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో ప్రభుత్వాసుపత్రుల తోపాటు ప్రత్యామ్నాయ చర్యలపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకు తీసుకోవాల్సిన ధరను తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా […]

Continue Reading

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన..

AP CM lays foundation stone: విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంప్ అఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు, అంబేద్కర్ స్మారక భవనం, గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. 20 ఎకరాల విస్థీర్ణంలో ఏడాదిలోపు ఈ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనికి […]

Continue Reading

‘టీడీపీ హయాంలోనే అవినీతి ఎక్కువ’

తూర్పుగోదావరి : పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్దాలేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. కాగా పూర్తి చేసిన ఇళ్లు ఎందుకు పంపిణీ చేయరని టీడీపీ నేతలు ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ నేతలు మోసపూరిత చర్యలకు పాల్పడకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చూసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం  నివేదిక అందాల్సి ఉంది. టీడీపీ హయాంలో జరిగిన […]

Continue Reading

పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా?

అమరావతి : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?’ అంటూ ఎద్దేవా చేశారు.

Continue Reading

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి ఫిర్యాదు

పశ్చిమ గోదావరి: తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. నిజాయితీ పరుడిగా, సేవా భావం కలిగిన వ్యక్తిగా, వివాదరహితుడిగా సమాజంలో తాను సంపాదించుకున్న మంచి పేరును చెడగొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని […]

Continue Reading

సంక్షేమానికి నిర్వచనం చెప్పిన వైఎస్సార్‌

అమరావతి: ప్రజా సంక్షేమ పథకాలతో చరిత్రను మేలిమలుపు తిప్పిన రాజకీయ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనీ, నిజమైన పాలకుడు ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు ఆయన అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్‌ 71వ జయంతి సభలో తొలుత రామకృష్ణారెడ్డితో సహా పలువురు నేతలు ఆవరణలోని వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సజ్జల మాట్లాడారు.

Continue Reading