పోలీసుల తీరుపై ధ్వజమెత్తిన రఘురామకృష్ణంరాజు

పశ్చిమగోదావరి: పోలీసుల తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. కోడిపందాల సాకుతో అమాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తే, నేరం అని కోర్టు చెప్పింది. కోళ్లను పెంచితే కాదన్నారు. కోర్టు ఆదేశాల సాకుతో పోలీసులు ఒవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. జీవనోపాధి కోసం కొందరు కోళ్లు పెంచుతుంటే, వాటిని తీసుకుపోతున్నారని చెప్పారు. కోళ్లు తీసుకు వెళ్లే వారు దొంగలతో సమానం.. దొంగలకు ఏ విధంగా బుద్ధి చెబుతారో వారికి అలాగే చేయండని సూచించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన […]

Continue Reading

కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

హైదరాబాద్: కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు వాక్సినేషన్ ఇవ్వాలన్నారు. వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో గైడ్‌లైన్స్ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే వెంటనే తగు చర్యలు చేపట్టాలన్నారు. వాక్సినేషన్ చేసే కేంద్రాల్లో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని పేర్కొన్నారు.

Continue Reading

జగిత్యాల జిల్లాలో ఘోర సంఘటన

Man Commits Suicide: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర సంఘటన జరిగింది. హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలంలోని నూకపల్లిలో జగిత్యాల-కరీనంగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న 130 కేవీ కరెంట్‌ టవర్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ కావడంతో మృతదేహం పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించారు. పోస్టుమార్టం […]

Continue Reading

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో తీపికబురు అందించారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్‌.. తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను […]

Continue Reading

కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు

నాగర్‌కర్నూల్‌ : హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు మండలంలోని కొండారెడ్డి పల్లి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుస్సేన్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..జిల్లాలోని ఉప్పునుంతల మండలం రాయిచేడి గ్రామానికి చెందిన హుస్సేన్ తన కూతురును కల్వకుర్తి గురుకుల పాఠశాలలో పరీక్ష రాయించి తిరుగు ప్రయాణమయ్యాడు. కాగా, తన ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కూతురుకు స్వల్ప […]

Continue Reading

ప్రభాస్ తో కేజీఎఫ్ డైరెక్టర్ 2 రోజులు మీటింగ్‌

కేజీఎఫ్ వంటి హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ చిత్రం చేస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ రానున్న రోజులు వరుసగా ప్రభాస్ తో సమావేశం కానున్నాడని ఫిలింనగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ తో సలార్ రెగ్యులర్ షూటింగ్‌తోపాటు ఇతర అంశాలపై ప్రశాంత్ నీల్ డిస్కస్ చేయనున్నాడట. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఫిబ్రవరి మొదటి వారంలో సలార్ […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు సరికాదని హైకోర్టు తెలిపింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే.. అవి కోవిడ్-19 టీకా కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తాయని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించలేదని, తనంతటతానుగా నిర్ణయం తీసుకుందని వివరించింది.

Continue Reading

తండ్రైన విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: భారత క్రికెట్ టీమ్ సారథి విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కోహ్లీ స్వయంగా ట్వీట్ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. ”మీ ప్రేమ, అభిమానం, ప్రార్థనలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈసారి మా గోప్యతను మీరు గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్” అని ట్వీట్ చేశాడు. ఈ రోజు సాయంత్రం అనుష్క […]

Continue Reading

‘ధరణి’ వందకు వందశాతం విజయవంతం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : భూ రికార్డుల నిర్వహణ, క్రమవిక్రయాలు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వందకు వందశాతం విజయవంతమైందని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలుకు మరింత వెసులుబాటు కల్పించేలా పోర్టల్‌లో అవసరమైన మార్పులను వారంరోజుల్లోగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం పలుశాఖలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖపై సుదీర్ఘంగా చర్చించారు. […]

Continue Reading

ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లు దాటిన కరోనా కేసుల సంఖ్య

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య తాజాగా 9 కోట్ల మార్క్‌ను దాటేసింది. జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 9,03,43,519గా ఉంది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 19,36,133కు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 2,24,09,480 కేసులు నమోదుకాగా.. 3,74,341 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికా […]

Continue Reading