Saturday, July 11, 2020

Politics

250 కోట్లతో మెగా డెయిరీ

రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.250 కోట్లతో మెగా డెయిరీని నిర్మించనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రకటించారు. దీనికి శ్రావణమాసంలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో పశుసంవర్ధకశాఖపై ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ..మెగా డెయిరీతోపాటు మామిడిపల్లిలో రూ.18.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పశు పరిశోధనకేంద్రం, పశువుల కృ త్రిమ గర్భధారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Crime

గుండెపోటుతో యువకుడి మృతి.. శవాన్ని తీసుకురావద్దన్న ఇంటి యజమాని

అనారోగ్యంతో చనిపోయిన ఓ యువకుడి శవాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దని ఇంటి యజమాని ఆదేశించాడు. ఆస్పత్రి నుంచి నేరుగా మీ సొంతూరికే తీసుకెళ్లండని హుకూం జారీ చేశాడు. అంతేకాదు నెల రోజులు పాటు తమ ఇంటికి రావొద్దని స్పష్టం చేశాడు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్య సుదర్శన్, సువర్ణ దంపతులు కొన్నేళ్ల క్రింత తంగళ్లపల్లికి వలస వచ్చారు. వీరికి ముగ్గురు […]

కుళ్లిన మాంసం తిని.. 90 మందికి అస్వస్థత

లోయలో పడి చనిపోయిన ఆవును రెండు రోజుల తర్వాత వండుకుతిన్న 90 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నారు. విశాఖపట్టణం జిల్లా పాడేరు డివిజన్‌ జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ మగతపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ రైతుకు చెందిన ఆవు ఈ నెల 6న సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి లోయలో జారి పడి మృతిచెందింది. గ్రామస్థులు గుర్తించి మరుసటిరోజు మధ్యాహ్నానికి దాని కళేబరాన్ని గ్రామానికి చేర్చారు. దాన్ని […]

Sports

ఐపీఎల్‌ ప్రతిపాదన చేయలేదు

వెల్లింగ్టన్‌: ఐపీఎల్‌ టోర్నీకి తాము ఆతిథ్యమిస్తామన్న ప్రతిపాదన చేయలేదని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు(ఎన్‌జడ్‌సీ) స్పష్టం చేసింది. భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికకు(ఎఫ్‌టీపీ) తాము కట్టుబడి ఉన్నామని ఎన్‌జడ్‌సీ అధికార ప్రతినిధి రిచర్డ్‌ బుక్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. దీనిపై రిచర్డ్‌ మాట్లాడుతూ ‘ఐపీఎల్‌ నిర్వహణపై వస్తున్న వార్తలు నిరాధారమైనవి. లీగ్‌ నిర్వహించే పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ లేదు. ఆతిథ్యానికి మమ్మల్ని అడిగినా..మేము నిర్వహించబోం’ అని అన్నాడు.

హంపి, హారిక ఓటమి

చెన్నై: ఫిడే మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప లెగ్‌-3లో భారత్‌ పోరాటం ముగిసింది. ఆన్‌లైన్‌లో గురువారం జరిగిన క్వార్టర్స్‌లో కోనేరు హంపి 2-9 స్కోరుతో అలెగ్జాండ్రా కోస్టెనిక్‌ (రష్యా) చేతిలో ఓడింది. మరో గేమ్‌లో ద్రోణవల్లి హారిక 2-9 స్కోరుతో హో యిఫాన్‌ (చైనా) చేతిలో పరాజయం ఎదుర్కొంది. ఆర్‌.వైశాలి తొలి రౌండ్‌లోనే హంపి చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 15న జరగనున్న ఆఖరి, నాలుగో లెగ్‌లో హంపి, హారిక, వైశాలి అదృష్టాన్ని […]