సైలెంట్ గా వస్తున్నాయి….మరి ఔట్ పుట్ ఎలా ఉంటుందో!

Entertainment

నిన్నటివరకు సాహో మానియా నడిచింది. అయితే ఆ సినిమా రిజల్ట్ వేరేలా ఉంటె పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ మొదటి షో పడ్డ దగ్గర్నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని మొదటి నాలుగు రోజులకే డ్రాపయింది. సాహో మీద నమ్మకంతో ఇంకే ఇతర నిర్మాతలు తమ సినిమాలను వారం గ్యాప్ తో వదిలే సాహసం చేయలేకపోయారు. అయితే సాహో కలెక్షన్స్ బాగా డ్రాపయ్యాయి కాబట్టి కంప్లీట్ గా 13 నుంచి బ్రేక్ పడనుంది.నాని గ్యాంగ్ లీడర్ ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమవుతోంది. లేడీ గ్యాంగ్ తో రివెంజ్ డ్రామాను నడిపించే పాయింట్ మీద దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాని కాస్త వినూత్నంగా తెరకెక్కించాడు. చెప్పుకోవడానికి రెండు రోజుల టైమే ఉంది. కానీ సోషల్ మీడియాలో కానీ జెనరల్ పబ్లిక్ లో కానీ ఈ సినిమా మీద ఉండాల్సినంత హైప్ కనిపించడం లేదు. ఓ ప్రీ రీలీజ్ – ప్రెస్ మీట్ తో సరిపెట్టేసి నాని ప్రమోషన్ కోసం అవుట్ డోర్ వెళ్ళాడు.ఇక వరుణ్ తేజ్ వాల్మీకి ఆ తర్వాత వారం అంటే 20న రానుంది. ట్రైలర్ తో మంచి మాస్ మసాలా సినిమా అనే అభిప్రాయం అయితే కలిగించారు. కానీ అందుకు తగ్గ క్రేజ్ ని పబ్లిక్ లో తీసుకురావడంలో టీమ్ అంత యాక్టివ్ గా కనిపిస్తున్నట్లు లేదు. వినయ విధేయ రామ – చిత్రలహరి తర్వాత వస్తున్న మెగా హీరోల సినిమా ఇదే.

కానీ ఆ అవకాశాన్ని పూర్తిగా వాడుకుంటున్నట్లు ఏమాత్రం అనిపించడం లేదు. ఇక సైరా కూడా ఇందుకు మినహాయింపుగా లేదు. అక్టోబర్ 2కి కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది. కాని ఇప్పటిదాకా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు వార్తలు కూడా లేవు. ఇలా వరసగా క్రేజీ సినిమాలు వస్తున్నా ప్రమోషన్ విషయంలో మేకర్స్ ఫాలో అవుతున్న పద్ధతి చూస్తుంటే ఓపెనింగ్స్ కి బాగా దెబ్బ పడేలా కనిపిస్తుంది. మరి అనుకున్న దానికంటే బడ్జెట్ దాటి పోవడంతోనే నిర్మాతలు ప్రమోషన్స్ అనుకున్నట్టుగా చేయలేకపోతున్నారా..లేక సినిమా ఔట్ పుట్ చూసుకున్నాక డిసప్పాయింట్ అయి ఊరుకుంటున్నారా అనేది తెలియడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *