‘సాహో’ ఇచ్చిన షాక్ తో ప్రభాస్-దిల్ రాజు పాన్ ఇండియా ప్రాజెక్ట్..?

Entertainment

ప్రభాస్ లేటెస్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘సాహో’ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్క దాదాపుగా తేలిపోయింది. ఇంకా థియేట్రికల్ రన్ ఉన్నప్పటికి బ్రేక్ ఈవెన్ అయ్యే స్థాయిలో మాత్రం కలెక్షన్స్ లేవు. హిందీ వెర్షన్ హిట్ అనిపించుకోగలిగింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బయ్యర్లందరికీ నష్టాలు తప్పేలా లేవు. ఇలా నష్టపోయేవారిలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఉన్నారు. అయితే భారీ ప్రాజెక్ట్ కాబట్టి మిగతా వాళ్ళకంటే దిల్ రాజుకు కాస్త ఎక్కువగానే నష్టం వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 

‘సాహో’ సినిమా నైజామ్.. ఉత్తరాంధ్ర ఏరియా రైట్స్ ను దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఇప్పుడు దాదాపు ఇరవై కోట్ల వరకూ నష్టం తప్పేలా లేదని లేటెస్ట్ న్యూస్. అంతే కాకుండా రిలీజ్ సమయంలో దిల్ రాజు యూవీ వారికి మరో 10 కోట్ల రూపాయలు సర్దుబాటు చేశారట. ఆ ఎమౌంట్ కూడా రాజుకి తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభాస్ రంగంలోకి దిగి రాజుకి కాంపన్సేషన్ డీల్ సెట్ చేశాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే రాజుకి ప్రభాస్ తన డేట్స్ ఇచ్చాడని తాజా సమాచారం. ఈ సినిమా ఎప్పుడు అనేది పక్కాగా వెల్లడించలేదు. అయితే దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ నటించడం మాత్రం ఖాయమైందని సన్నిహిత వర్గాల నుండి అందిన సమాచారం.

ఇదే గనక జరిగితే ఇద్దరికీ బెనిఫిట్ అయ్యే సూపర్బ్ డీల్ అవుతుంది.ఎందుకంటే ప్రభాస్ కు ప్యాన్ ఇండియా మార్కెట్ ఉంది. తన సినిమాలు హిందీలో రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు దిల్ రాజు చాలా రోజుల నుండి బాలీవుడ్ లో నిర్మాతగా ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ‘జెర్సీ’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఫ్యూచర్ లో ప్రభాస్ లాంటి హీరోతో ఆయన బ్యానర్ లో ఓ సినిమా, సినిమా తెరకెక్కితే బాలీవుడ్ మార్కెట్ పై దిల్ రాజు పట్టు సాధించడం పెద్ద విషయమేమి కాదంటు అందరు చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *