షారుక్‌ఖాన్‌తో బ్రావో డ్యాన్స్‌

Sports

కరీబియన్‌లో జరుగుతున్న ప్రీమియర్‌లీగ్‌లో ‘ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు విజయాలో దూసుకెళ్తోంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌ యజమానిగా ఉన్నాడు. వెస్టిండీస్‌ ఆటగాడు పొలార్డ్‌ ట్రిన్‌బాగో జట్టుకు సారధిగా ఉన్నాడు. ఈ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మంచి జోరులో ఉన్న జట్టుకు ఉత్సాహాన్ని కలిగించేందుకు షారుక్‌ పార్టీని నిర్వహించాడు. ఈ పార్టీలో విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావోతో కలిసి షారుక్‌ స్టెప్పులేశాడు. అతడి హిట్‌సాంగ్స్‌లో ఒకటైన లుంగీ డ్యాన్స్‌ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో బ్రావో తన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *