ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్థానం

Sports

భారత అథ్లెటిక్స్ ఛాంపియన్‌ హిమదాస్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారతబృందంలో స్థానం సంపాదించుకుంది. హిమదాస్‌తో పాటు మరో 25మంది అథ్లెట్ల జాబితాలను భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య(ఏఎఫ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. ఇటీవల జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో హిమదాస్‌ ఐదు స్వర్ణాలతో సత్తా చాటిన నేపథ్యంలో రాబోయే ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌లోనూ హిమ పతకాలు సాధిస్తుందనే ధీమాతో ఏఎఫ్‌ఐ ఉంది. అలాగే మోచేయి శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్న జావెలిన్‌ త్రో ఆటగాడు నీరజ్‌ చోప్రా ఎంపికపై సెలక్టర్లు త్వరలో ఓ నిర్ణయం వెల్లడించనుంది. ఈ పోటీల్లో పాల్గొనే భారతజట్టు బృందంలో ద్యూతీ చంద్‌(100మీ.), అర్చన సుసీంద్రన్‌(200 మీ.), హైజంపర్‌ తేజస్విని శంకర్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 6 వరకు దోహాలో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *