కోహ్లీ అలా చేసి తప్పు చేశాడు: సెహ్వాగ్

Sports

యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో మొత్తం 180 పరుగులు మాత్రమే చేయడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. అలాగే లేని పరుగు కోసం ప్రయత్నించి రోహిత్ శర్మ అవుటవడానికి కారకుడయ్యాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల్లో కోహ్లీ వరుసగా 0, 92, 28, 21, 39 పరుగులు చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ కాకుండా సెంచరీ చేసి ఉంటే బాగుండేదని అన్నాడు. కోహ్లీ ఎక్కువగా థర్డ్ మ్యాన్ వైపు బంతిని తరలిస్తూ సింగిల్స్ తీస్తున్నాడని, గతంలో తాను అలానే చేసినప్పుడు సచిన్ తనకు ఓ సలహా ఇచ్చాడని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. సింగిల్స్ కోసం ప్రయత్నిస్తూ వికెట్ పోగొట్టుకుంటే ఆ ప్రభావం జట్టుపై పడుతుందని, కాబట్టి సింగిల్‌కు బదులుగా బౌండరీలపై దృష్టి సారించాలని సచిన్ తనకు సలహా ఇచ్చాడని వివరించాడు. ఇప్పుడు అదే సలహాను తాను కోహ్లీకి ఇస్తున్నానని సెహ్వాగ్ అన్నాడు.

Leave a Reply