‘ఆర్ఆర్ఆర్’ పై అవన్నీ ఒట్టి పుకార్లని తేల్చేసారు….!!

Entertainment

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా దాదాపుగా రూ.450 కోట్ల భారీ బడ్జెతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కావడంతో పాటు, స్వతంత్రోద్యమ నేపథ్యంగా పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని అందరూ నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గెరియా దేశంలో జరుగుతోంది.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక క్యామియో పాత్రలో నటిస్తున్నారు అంటూ ఇటీవల కొన్నాళ్ల క్రితం విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే నేడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆ వార్తకు పూర్తిగా ఖండించారు విజయశాంతి, ప్రస్తుతం తాను సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రమే నటిస్తున్నానని ఖరాఖండిగా ఆమె తేల్చి చెప్పడం జరిగింది. దీనితో ఆ వార్తలకు పూర్తిగా అడ్డు కట్ట పడ్డట్లైంది.

సినిమాలో క్వాలిటీ విషయమై ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని, దర్శకుడు రాజమౌళి, ఈ సినిమాను ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని నిర్మాత దానయ్య ఇటీవల మాట్లాడుతూ చెప్పారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇటీవల ఎన్టీఆర్ ప్రక్కన ఒక బ్రిటిష్ నటిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఆర్ఆర్ఆర్ సినిమాను వచ్చే ఏడాది జులై 30న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో లో రిలీజ్ చేయనున్నారు…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *