Thursday, September 24, 2020

Politics

ఏడు రాష్ట్రాలు, యూటీల్లో 43 బ్రిడ్జిలను ప్రారంభించనున్న రక్షణమంత్రి

న్యూఢిల్లీ : లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 43 వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వెళ్లే మార్గంలో నెచిఫూ టన్నెల్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ ఓ) తయారు చేసిన 43 వంతెనలను జాతికి అంకితం చేయనున్నారు. వంతెనల్లో 10 జమ్మూ కాశ్మీర్‌లో, హిమాచల్‌ప్రదేశ్‌లో […]

Crime

మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి ఆభరణాల చోరీ

గుంటూరు జిల్లా నకరికల్లులోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. రూ.1.25లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులు, ఆలయ ట్రస్టీ నకరికంటి విశ్వనాథశర్మ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు ఆలయం వెనుక వైపు ప్రహరీ దూకి, తర్వాత ప్రధాన ఇనుప గేట్ల తాళాలు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి వెండి కిరీటం, వెండి కళ్లు, బంగారు బొట్టు, 2 బంగారు మంగళ సూత్రాలు, వెండి పాదాలు దోపిడీ చేశారు. వీరభద్రుడి ఆలయంలో స్వామి […]

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం

నిత్యం శ్రీశైలం వస్తూ పోతుండే వాహనాలతో రద్దీగా ఉండే శ్రీశైలం ఘాట్‌రోడ్డులో అనుకోని రీతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం ఈగలపెంట మూల మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ వాల్‌ను వ్యాను ఢీకొని సుమారు 20 అడుగులు లోతున్న లోయలోకి పడిపోయింది. హైదరాబాద్‌ దూల్‌పేటకు చెందిన కొంతమంది భక్తులు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అందులో వున్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు, స్థానికులు […]

Sports

రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలుపు

అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మురిసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 49 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జయభేరి మోగించింది. ఈ పోరులో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో […]

ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి

మైదానం చూస్తే చాలా చిన్నది.. పైగా బ్యాటింగ్‌ పిచ్‌.. ఇంకేముంది.. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సొమ్ము చేసుకుంటూ సంజూ శాంసన్‌ చెలరేగాడు. బంతి పడిందే ఆలస్యం.. చూడాల్సింది ఆకాశం వైపే అనే తరహాలో ఏకంగా 9 సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ఆఖర్లో ఆర్చర్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో రాజస్థాన్‌ జట్టు చెన్నై ముందు రికార్డు లక్ష్యాన్ని ఉంచగలిగింది. కానీ అత్యంత సీనియర్‌ లైనప్‌ కలిగిన సీఎ్‌సకే మాత్రం తమ బ్యాట్లను ఝుళిపించలేకపోయింది. అయితే డుప్లెసి ఒక్కడే […]